ఆలోచన! అచ్యుతుని రాజ్యశ్రీ

 కొందరిని మనం చాలా అమాయకంగా ఏమీతెలీని చదువు సంధ్య లు లేనివారని అంచనావేసి చిన్న చూపు చూస్తాం.పిల్లలను కూడా తక్కువ అంచనావేయకూడదు.వారి ఆలోచనలు పెద్దలకన్పా భిన్నంగా ఉన్నా  మనల్ని ఆలోచన లో పడేయిస్తాయి
పడేయిస్తాయిఅలాంటిదే మెక్సికో దేశపుకథ.ఓబీదరైతు ఉండేవాడు. అతివృష్టి అనావృష్టితో అతని పంట నాశనమైంది. పైగా నోటి దురుసుమనిషి!అందుకే ఎవరూ అతని కి సాయంచేయటానికి ముందుకి రాలేదు.కానీ అతనికి దేవునిపై గొప్ప నమ్మకం!ఎలాగైనా తప్పక దేవుడు ఏదోరూపంలో సాయంచేసి తనను గట్టెక్కిస్తాడు అని. మనం మనస్ఫూర్తిగా నమ్మి "నీవేతప్ప ఇత:పరంబెరుగ"అని గజేంద్ర మోక్షం లోని ఏనుగు ప్రహ్లాదుడు ధ్రువుడు మార్కండేయునిలా నిష్కామంగా నిర్మలంగా స్మరణచేస్తే ఏదో రూపంలో భగవంతుడు కాపాడుతాడు.ఆరైతు ఏంచేశాడో తెలుసా? అతని ఊళ్ళో చిన్న పోస్ట్ ఆఫీసు ఉంది. జనం లేఖలు రాసి డబ్బా లో పడేయటం మళ్ళీ వారి కి  ఉత్తరాలు రావటం చూశాడు.అంతే తనూ ఓపోస్ట్ కార్డు కొని దేవునికి ఇలా రాశాడు"ఓదేవుడూ!నీవు మహా జాలిగుండెవాడివని  అంతాచెప్తారు.ఈసారి వడగళ్ళ వానతో నాపంట సర్వనాశనమైంది.నీవేకదా వర్షం  వడగళ్ళు కురిపిస్తావు.నాకు ఓ వంద డాలర్లు పంపుచాలు.ఆరునెలల కల్లా పంటచేతికి రాగానే నీబాకీ చెల్లిస్తాను.సరేనా?"దానిపై అడ్రసు ఇలారాశాడు"భగవాన్!స్వర్గపురి".  పోస్ట్ ఆఫీసు వాళ్ళు ఆకార్డు చదివి జాలి పడ్డారు. అందులో రైతు చిరునామా ఉంది కాబట్టి చందాలేసుకుని  ఎనభైడాలర్లు పోగేసి కవరులో పెట్టి రైతుకి అందజేశారు. రైతుకి ఓఅనుమానం వచ్చింది. "నేను వంద డాలర్లు పంపమని దేవునికి లేఖరాశాను కదా?మరి ఎనభైడాలర్లు మాత్రమే పంపాడేంటి?"మనసులో మల్లగుల్లాలు పడి మళ్ళీ ఇంకో కార్డు రాశాడు"ఓదేవుడూ!నీకు నమస్కారం!ధన్యవాదములు. నాకు నీవు  ఎనభైడాలర్లు పంపావు ఏంటీ?నాకు మని ఆర్డర్ ద్వారా నే మిగతా ఇరవై డాలర్లు పంపు.పోస్ట్ ఆఫీసు వాళ్ళు నీవు పంపిన దాంట్లో  ఇరవై ఉంచుకుని నాకు  ఎనభైడాలర్లు కవరులో పెట్టి ఇంటికి వచ్చి ఇచ్చారు. మనిద్దరం మోసపోకుండా ఈసారి పంపుతావు కదూ?" ఆలేఖను చదివిన  పోస్ట్ ఆఫీసు వారి మొహాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి మరి!🌹
కామెంట్‌లు