: ఆంగ్ల సంవత్సర వేడుకలు ;- యామిని కొళ్లూరు
 ఆంగ్ల సంవత్సర వేడుకలు 
         గతయేడు గడచిన క్షణాలు
       మదిలో మరువలేని ఙ్ఞాపకాలు
      చూడచక్కని తెలుగు సున్నితంబు 

 కొందరికి అంతులేని విజయాలు 
         కొందరికి మిగిలిన విషాదాలు
       కొందరికి ఎటుతోచని ప్రశ్నర్థకాలు
      చూడచక్కని తెలుగు సున్నితంబు 

 బడులు మూతపడిన సంవత్సరం 
       రైతుల కోర్కెలుతీరని సంవత్సరం 
     భయాలతో బిక్కుమన్న సంవత్సరం 
      చూడచక్కని తెలుగు సున్నితంబు 

 కొత్తఅ

డుగుతో ఆశయాలు సాధిధ్ధాం
         కొత్తఆలోచనలకి రూపకల్పన చేద్దాం 
         కొత్తప్రణాళికలకి నాంది పలుకుదాం
         చూడచక్కని తెలుగు సున్నితంబు 

 ఆనందాల హరివిల్లులు స్వాగతిద్దాం
        అందరిని సహృదయంతో పలకరిద్దాం 
        ఈయేడు బాగుండాలని కోరుకుందాం 
         చూడచక్కని తెలుగు సున్నితంబు 

కామెంట్‌లు