ఆ ముగ్గురు తెలుగు వెలుగులు ; ప్రొఫెసర్ చేపూరి నరేష్ బాబు
 ప్రొఫెసర్ చేపూరి నరేష్ బాబు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద
కవి సైన్స్ రచయిత ప్రతాప్ కౌటిల్య రచనలపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు స్పందించి ప్రశంసాపత్రాన్ని పంపించిన సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరేష్ బాబు రచయిత తో ముఖాముఖి.
వెంకయ్య నాయుడు గారి ప్రశంసాపత్రం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ?
అభినందనలు ప్రశంసాపత్రాలు అందరికీ వస్తాయి కానీ అది మనకు వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఎలా స్పందిస్తున్నాం అన్నది మనకు ముఖ్యం. ఎందుకంటే అది మనకు మాత్రమే లభించిన ప్రశంస కాబట్టి. నా మట్టుకు నేను ఆ ప్రశంసను మనస్ఫూర్తిగా స్వీకరించి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు ఇచ్చిన ప్రశంసాపత్రాన్ని ఒక గొప్ప జాతీయస్థాయి అవార్డు రివార్డు గా భావించి ఒక గొప్ప స్ఫూర్తిని స్పిరిట్ను పొందుతున్నాను వారికి వినమ్రంగా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మీకు యూనివర్సిటీ డిగ్రీ లు ఉన్నాయి కానీ మీరు ఈ ప్రశంసాపత్రాన్ని ఎలా భావిస్తున్నారు?
ఉద్యోగాల కోసం ధనార్జన కోసం విజ్ఞానం కోసం మనం చదివే చదువు వల్ల యూనివర్సిటీలో డిగ్రీలను పొందుతాం దాని వల్ల ధనం వస్తుందేమో కానీ పెద్దగా కీర్తి రాదు. కానీ మన జీవిత చరిత్ర లో కళలు సృజనాత్మకత అంశాల్లో ప్రవేశం చేసిన కృషికి ఒక ప్రత్యేక గుర్తింపు కీర్తి లభిస్తుంది. అది ఒక మానసిక సంతృప్తిని సంతోషాన్ని మిగులుస్తుంది.
మీకు లభించిన ప్రశంసా పత్రం పై మీ అభిప్రాయం ఏమిటి?
అవార్డులు రివార్డులు అన్నవి ఆస్తుల లాంటివి. కానీ అభినందన ప్రశంసా పత్రాలు అన్నవి శాసనాలు తామ్రపత్రాల లాంటివేమీ. మానవ చరిత్రలో కాదు మన జీవిత చరిత్ర లో శిలాశాసనాల్లా నిలబడతాయి.
ఎం వెంకయ్య నాయుడు గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు!?
భారతదేశ చరిత్రలో తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తులు ముగ్గురు. వారిలో తెలుగు సింహాలు రెండు ఒకరు ఎన్టీరామారావుగారు మరొకరు పీవీ నరసింహారావు గారు. మూడో వ్యక్తి ఇ సింహం కాదు పులి. ఆ  మూడో పులే ఎం వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు ఒక గొప్ప వక్త ఆపరేటర్ పరిశోధకుడు నేత రచయిత కవి విమర్శకుడు ఒక గొప్ప జర్నలిస్టు కూడా. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
వెంకయ్య నాయుడు గారు ఉత్తరంలో మీకు సూచించిన అంశాలు ఏవి!?
శాస్త్ర విజ్ఞానాన్ని సరళంగా సృజనాత్మకంగా ఇన్నోవేటివ్ గా అందరికీ అర్థమయ్యేలా కొత్తగా సైన్స్ రచనల ద్వారా చెప్పాలని సూచించారు. అంతేకాకుండా సాహితీ రచనలు మరెన్నో చేయాలని సూచిస్తూ యువతకు ఒక స్ఫూర్తి ప్రదాతగా మార్గదర్శకం వహించాలని నాయకత్వ లక్షణాలను సాహితీ జిజ్ఞాసను శాస్త్రియ ఆలోచనలను రచనల ద్వారా కలిగించాలని సూచించారు.
ఇంత వరకు మీరు ఎన్ని రచనలు చేశారు రచనలు చేయడానికి మీకు స్ఫూర్తి ఎవరు!?
సైన్స్ రచనలు చేయడానికి డాక్టర్ మహీధర నళినీ మోహన్ రావు గారు నాకు స్ఫూర్తి ప్రదాత. నేను సైన్స్లో ఇప్పటివరకుమూడూ పుస్తకాలు రాశాను అవన్నీ కూడా కొన్ని ప్రత్యేక అంశాలపై నాకున్న అవగాహన కొత్త ఆలోచనలు ఇన్నోవేటివ్ గా శాస్త్రజ్ఞులకు సూచనలు గా భావిస్తున్నాను. ఇకపోతే సాహిత్యం లో నాకు స్ఫూర్తి నా భార్య సునీత మాత్రమే ఆమె కూడా ఒక కవి రచయిత కావడం నా అదృష్టం. ఆమె ప్రోత్సాహం లేకపోతే నేను కవిని అయ్యే వాడిని కాదు.
యువతకు మీ సందేశం ఏమిటి!?
ప్రతి విద్యార్థి కూడా ఒక రచయితే. ఎందుకంటే విద్యార్థి చదవడమే కాదు బాగా పరీక్షల్లో రాస్తాడు కాబట్టి ఇ రాయగలిగిన ప్రతివాడు రచయితే. అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆలోచించి జ్ఞాపకం ఉంచుకుని పరీక్షలలో రాస్తున్నాడు కాబట్టి అతను కూడా ఒక గొప్ప రచయిత కిందే లెక్క. కానీ రాయడం మాత్రమే కాదు దాన్ని మాట్లాడగలగాలీ. ఇప్పుడు మాట్లాడగలిగిన వాడే దేనిలోనైనా నాయకుడు కాగలుగుతాడు కాబట్టి. నీవు చేసే పని నీవు ఉంటున్న వాతావరణం నీ పై చాలా ప్రభావాన్ని చూపుతుంది.. ఆలోచనలను కూడా మార్చగలిగే శక్తి పని ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గొర్రెలు కాసే వాడు డు గొర్ల కాపరి అవుతాడు. అది అది వాడి పని అవుతుంది. ఇంతవరకు అంతవరకు ప్రమాదం లేదు. కానీ కొద్ది రోజులకు గొర్ల కాపరి గొర్రె అయ్యే అవకాశం ఉంద. అది అది చాలా ప్రమాదకరమైన విషయం.. అది యువకులు యువకులు గుర్తించాలి గుర్తించాలి గుర్తించాలి.


కామెంట్‌లు