ప్రకృతి సంక్రాంతి-;-మాడుగుల మురళీధర శర్మ కాళేశ్వరం సిద్ధిపేట
 నాటి ప్రకృతి సంక్రాంతి
ఉ.మా.1
నాగలి,కఱ్ఱు,టెద్దులును*
నాణ్యతగా,తలపాగకట్టుతో!
సాగున రైతులందరును*
సాగుచునింటికిపాడిపంటలన్!
ప్రోగునరాగముంగిలుల*
పుష్యమిపున్నమికాంతివెల్గగా!
ఉ.మా.2
ధాన్యపు రాశిగామిగులు*
దైవసుగంధపుపౌష్యలక్ష్మిప్రా!
ధాన్యతమీర వచ్చెనవ*
తావినిపంచగపల్లెపల్లెసా!
మాన్యులు,మాన్యులం దరును*
సంబరసంభ్రమమందుతేలుచున్!
అన్యములేమినెంచకయె*
నందరువందనమందజేయగన్!
కందము-3
ప్రాకృతికకాంతిశోభలు
స్వీకృతిగా గంగిరెద్దు*
శ్రీకర,నృత్యాల్!
లోకేషునికీర్తనలును
సాకారములిచ్చిపిల్చు*
సౌభాగ్యములన్!
కందము-4
రంగుల ముగ్గులు ముంగిలి
నంగిలిహరిదాసకీర్త*
నారంజిల;తా!
రంగుపతంగులునింగిని
శృంగారపుసోయగమ్ము*
జీవామృతమౌ!
శార్దూలము-5
సారాంశమ్ములునిల్లుచేరునిలలో*
సంసార సంక్రాంతిగా!
పారావారపుసంతుబంధుతతతులున్*
సౌభాగ్యసంస్కారులై!
తారాతోరణధాన్యరాశివిరులన్*
తాదాత్మ్యతాసిధ్ధితో!
నీరోజున్నిడుదానధర్మములుగా*
నీయాంశముల్యాచనన్!
కం-6
చలివణుకునప్రకృతినిగని
తిలలనుకలగలిపివాడి*
తిలపిష్ఠముగా!
నులివెచ్చనిసకినములను
కలిలోసంక్రాంతినాడు*
ఘనముగపంచున్!
కందము-7
భోగినభుగభుగమంటలు
రోగములనుదూరమంపు*
రుజువర్తనగా!
యుగయుగమునచలిబాధల
నగణితముగతీర్చివేడి*
నందించునుగా!
కందము-8
బొడబొడపోకలనిడి;దో
సిడిలోరేగులునుపెసర*
చిక్కుడు కాయల్!
కడుబియ్యమునుకలిపితా
వడివడిపిల్లలశిరాన*
వనితలుపోయున్!
కందము-9
రంగుల ముగ్గుల మధ్యన
శృంగారపు గొబ్బెమలను*
శుభసూచకమున్!
అంగనలందరుపెట్టుచు
రంగనికాహ్వానమిచ్చు*
రయముగనింటన్!
మకరసంక్రమణము
ఉ.మా-10
భానుడుమార్పుచెందితన*
బాటధనుస్సునుమార్చివేగమే*
తానుగచేరుసంక్రమణ*
తా:మకరమ్మనురాశిలోపలన్!
మానవమాత్రులీదినము*
మాన్యతమీరగతర్పణమ్మిడున్!
కందము-11
తిలస్నానము,తిలదానము
తిలతర్పణములనునివ్వ*
తీర్థములందున్!
తిలతైలము,తిలభుక్తము
కలిలోతిలపాపహారి*
కలిచలిదూరన్!
ఉ.మా-12
మార్గళిమార్గశీర్షమున*
మాధవనామముకీర్తనమ్ముగా!
దుర్గములందు,మౌని,గురు*
దేవులుచేతురునాల్గుమాసముల్!
నిర్గమ పాపహారకర*
నిత్యపవిత్రకధర్మదీక్షగా!
నిర్గుణసేవనమ్ముకడు*
నిక్కపుమోక్షసుసాధనమ్మగున్!
 
కందము-13
గోదారంగవివాహము
మేదిని దేవళములందు*
మేటిగచేయున్!
మోదముచేకూర్చగ;దా
మోదరుడానందమంది*
మోక్షమునొసగున్!
కందము-14
తరుణోపాయముజీవికి
మరుజన్మకుమోక్షపథము*
మారకమందున్!
విరివిగతర్పణములును;మ
కరసంక్రమణమునజేయ*
కలుగుఫలితముల్!

కామెంట్‌లు