సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 నమ్మకాన్ని వమ్ము చేస్తే...
********
మనిషికి మనిషికి మధ్య అనుబంధం ఆత్మీయత,అభిమానం, స్నేహం మొదలైనవన్నీ నమ్మకం మీదనే ఆధారపడి ఉంటాయి.
నమ్మకమే అమూల్యమైన ఆస్తి, ఎదుటి హృదయాన్ని తాకే విశ్వాసమే వ్యక్తిత్వాన్ని కాపాడే రక్షణ కవచం.
ఒక్కసారి నమ్మకాన్ని వమ్ము చేసిన, కోల్పోయేలా ప్రవర్తించిన వ్యక్తిని మళ్ళీ నమ్మడం చాలా కష్టం,ఒకోసారి అసాధ్యం కూడా...
నమ్మకం కోల్పోయిన వ్యక్తికి ఎన్ని సిరి సంపదలు ఉన్నా... అన్నీ కోల్పోయిన అనాధే.
అందుకే నమ్మకాన్ని ఎంతో జాగ్రత్తగా, అద్దంలా కాపాడుకోవాలి.
నమ్మకం అస్తిత్వానికి జీవిక.ఆత్మ గౌరవ ప్రతీక
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు