ప్రేమ వంచన;భార్గవి;-కలంస్నేహం
నీ ఆగమనం వసంతాగమనమని తలచి
నీ వెనుక అడుగులో అడుగేసిన

సంతోషంతో బందాలను సంకలనం 
బాధలను వ్యవకలనం చేయొచ్చని..

ఆత్మ విశ్వాసంతో ఆత్మస్థైర్యంతో శేషము 
తెలియక విశేషమైన జీవితాన్ని ఊహించినా.. 
బలమెరగని అబలలా 
సగటు ఆడపిల్లనై..

మమకారం మారదా శ్రీకారం లా
అనుకున్న అనురాగంతో..

గతమంతా వెంట వేసుకొని నీ వెంటరాలేదా నీవు కావాలని..

మురిపెంగా మురిపాలన్నీ మురికివాడలో మురిగెనె..

ప్రేమతో పంచన చేరగా
వంచనతో నను ఏమార్చగా..

అందం చూసి అంతరంగాన్ని చూడక అందలమెక్కిన 
పలుముఖాల గోముఖాన్ని చూసి..

 ఆర్తిగా హారతిచ్చి ఆహ్వానించి 
కర్పూర హారతిలా కరిగిపోయా..

నీ మాటల గమ్మత్తులో మైమరచిన మత్తుగా..

గారడి చేసి మాయంచేసావ్ మాయల మరాఠలా
మగాడిలా..మంత్రగాడిలా..

రాచబాట వదలి నీ వెంట ముళ్ళబాటన నడిచా..

ప్రేమ విరులు చల్లిన నాకు 
ఆవిరులు పట్టేనే నీ అసలు రూపు చూడగా...

చక్కని మనోభావాలుగల నాకు బయటపడనివ్వని అనుభవాలు చూపావ్..


నిను నమ్మి అర్పించిన యవనమంతా..
సొమ్ము చేసుకున్నావ్ నను అమ్మి...

చిరకాలం తోడుంటా వనుకొంటే 
మందుల్లేని   అంటు  రోగాన్నిచ్చావ్ కలకాలం నన్నంటుకొని తోడుగా...
నన్నొదలని నీడగా..

కాలం తీసుకున్న నిర్ణయానికి కాలాన్నే జవాబివ్వమని...

ఏ కోరిక లేక కోరుకొంటున్న వేదనతో ఆవేదనగా...


కామెంట్‌లు