అర్దనారీశ్వరం ;-కృష్ణవేణి పరాంకుశం;-కలం స్నేహం
అర్దనారీశ్వరతత్వం
ప్రకృతిలోని మహత్యం

సమ సమాజ స్వప్నానికి
అచ్చమైన ప్రబంధం
బ్రతుకులోని ఆత్మీయతా పరిమళాలనుపంచే
ఆనంద నందన గ్రంధం.

సఖ్యత,స్వచ్ఛతే ఆలంబనగా
శాంతి,సహనం అనే సంపదలే ఆభరణాలుగా
నియంత్రణను పాటించే 
అచ్చమైన సంస్కృతి

ఆడ ,మగ లేదు భేదం
ఇద్దరి కలియికే అద్భుత సృష్టి
ఆత్మలు వేరైనా శరీరం ఒక్కటే
తనువులు వేరైనా మనస్సు ఒక్కటే

ఆడజన్మకు పరిపూర్ణత నిచ్చేది పురుషుడు
పురుషునికి  అన్నీ తానై అండగా నిలుస్తుంది స్త్రీ
ప్రకృతి,పురుషుని సమాగమనమే
హృదయాలకు పరవశం.

ఇదే కదా అర్దనారీశ్వర తత్వం
ప్రకృతి లోని మహత్యం
స్త్రీ పురుషుల సంగమం
మానవ కల్యాణ వికాసం.


కామెంట్‌లు