సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు,

 
సత్యము-
@ సత్యం, రూపం, అధ్యయనం, ఉపాసన,సత్ ప్రవర్తన, బలం, ధనం, పరాక్రమం, అనే లక్షణాలు స్వర్గానికి నిచ్చెనలు.   
@ సత్యం, శాంతి, ప్రేమ, ధర్మము హృదయాలుగా వున్నప్పుడు  దైవం కాపాడును. 
@ సత్యమే జ్ఞానం, ఈశ్వరుడు, ధర్మం, న్యాయం.  సత్యమే సర్వం. సత్యం మీదనే చరాచర ప్రపంచం నిలచి వుంది. 
@ సత్యానికి నిజమైన స్వేచ్ఛనిస్తే ఆ సత్యం నీకు స్వేచ్ఛను కలిగిస్తుంది. 
@ సర్వము సత్యంలోనే నిలిచి ఉంటుంది .  మహాభారతం
@ సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, సర్వావయనాం శిరః ప్రధానం – పరిపూర్ణ సత్యం.
@ సౌందర్యమే సత్యం.   సత్యమే సౌందర్యం .  జాన్ కిట్స్

కామెంట్‌లు