చైతన్య దీపిక ;-కవిత సీటిపల్లి;-కలం స్నేహం
 చలి మంచు వేకువలో 
కువ కువ రాగం పలికే కోయిల
చలి మంట కిరణంలో
చెలి కౌగిలి అనురాగం కులికే ఊయల...
చెరగని చిరునవ్వుల 
సంతకంలో...
చిలిపి ఆధరం  మురిసే ముద్దుల లతలా...
చిగురు మొగ్గ తావిలో
చింతలన్ని చీకటిలో వదిలే పువ్వులా..
చల్ల చల్లని తెల్లారు జాం  నీటిలో...
చెడు ఆలోచనలు వదిలే 
కన్నీటిలా...
చెంత లేని కాలం ఒంటరై కుమిలే...
చెలిమి చిరునామా తెలిపే చిరు దీపం కాంతిలా...
చోటు లేని హృదయంలో...
చరిత రాయాలని కదిలే ప్రేమ పక్షిలా...
చుక్కలన్ని ఏరి నేలలో
చక్కని ఆశలు నింపే రేయి పగలలా...
చైతన్యం ధ్వనించే కలంలో...
చీకటిని చేదించే కలం స్నేహం...

కామెంట్‌లు