మాట విన్న భగవంతుడు!;-- జగదీశ్ యామిజాల
 ఆయనొక సూఫీ జ్ఞాని.
ఓరోజు స్నానం చేయడానికి నదీతీరానికి 
వెళ్ళాడు. 
వేసుకున్న బట్టలు తీరాన ఉంచి నదిలోకి దిగాడు.
కాస్సేపటికి అటువైపు ఒకడొచ్చాడు. 
అతనిది సాయం చేసే గుణం.
తీరాన బట్టలుండటం చూస్తాడు.
అయ్యో, ఎవరో మరచిపోయారు...వచ్చి తీసుకుపోతే వరకూ ఉందామని ఆ బట్టల దగ్గరే కూర్చుంటాడు.
నదిలోకి దిగిన సూఫీ జ్ఞాని 
స్నానం ముగించుకుని తీరానికొస్తాడు. 
తన బట్టలు తీసుకుంటుంటే
అక్కడ వాటిని చూసుకుంటున్న వ్యక్తి "మరీ అంత అజాగ్రత్తయితే ఎలాగండి. ఇలా ఇక్కడ విడిచిపెట్టి పోయారేమిటీ. నేను చూసుకున్నా కాబట్టి సరిపోయిందీ" అంటాడు.
అప్పుడా సూఫీ జ్ఞాని "అబ్బే. నేను స్నానానికి పోతూ పోతూ భగవంతుడికి చెప్పే వెళ్ళానండి. ఆ భగవంతుడు నా మాట విన్నాడు కనుకే మిమ్మల్నిక్కఖిక పంపించాడండి వాటిని చూసుకోవడానికి"


కామెంట్‌లు