నిరుపమానద్వయం-జన్మదినం!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు
 1.సర్ ఐజాక్ న్యూటన్!
   విజ్ఞానశాస్త్ర పితామహుడు!
   విశ్వవిజ్జాన భాస్కరుడు!
   ఆధునిక గణిత ఆద్యుడు!
   భౌతికశాస్త్రాన ఆరాధ్యుడు!
   దిశానిర్దేశగ్రంథాల తూర్పు!
   ఆయన గమనసూత్రాలు, 
మానవజీవనగమన సూత్రాలే!
  గురుత్వాకర్షణశక్తిగా,
             ప్రాతఃస్మరణీయుడు!
  ఏపిల్ చూస్తే గరుతొస్తాడు!
  పేరు చెప్పితే చాలు,
   ప్రపంచమంతా yes sir!
   అని ప్రణమిల్లే ఒకే ఒక sir!
2.లూయిస్ బ్రెయిలీ!
నేడు ప్రపంచ బ్రెయిలీ దినం!
అంధులవెలుగుల శుభదినం!
నావ నీటిలో ఉన్నా మునగక! 
ఈతరానివారికి ఊతవుతుంది!
ఆయన అంధుడే!
అంధులపాలిట అవతారుడే!
 అంధత్వాన్ని అధిగమించే!
  అక్షరాలకు ఊపిరి లిపి!
స్పర్శ ఆధారంగా అందించాడు!
నేడు అంధులు చదివినా,
   వ్రాసినా ఆయనే ఆద్యుడు!
నేడు భౌతికంగా లేకున్నా,
 నిత్యం అంధులవేళ్ళకొసల్లో,
  ఉంటూ నడిపిస్తాడు!
.

కామెంట్‌లు