నూతన ప్రణాళికలతో ఆంగ్ల సంవత్సరాది కి స్వాగతం.కుసుమంచి నాగమణి.
నూతనోత్సాహంతో ఆహ్వానం పలకాలి.
నూతన ప్రణాళికలు వేయాలి.
పథకం ప్రకారం నడవాలి.
చూడచక్కని తెలుగు సున్నితం బు.

 జీవితలక్ష్యాలు  ఏర్పాటు చేసుకోవాలి.
సాధనకు ప్రయత్నం చేయాలి.
 గమనంద్వారా గమ్యం చేరాలి.
చూడచక్కని తెలుగు సున్నితంబు.

 బాధలను , దుఃఖాలను,మర్చిపోవాలి.
మధురజ్ఞాపకాలును గుర్తుకు తెచ్చుకోవాలి.
సాధించాల్సిన దానిపైనే  దృష్టిపెట్టాలి.
చూడచక్కని తెలుగు సునీతంబు.

  ప్రణాళిక  కాలంతో పోటీపడాలి.

సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
భవిష్యత్తును అంచనా వేయగలగాలి.
చూడచక్కని తెలుగు సున్నితంబు.

తనపైతనకు  ఆత్మవిశ్వాసం ఉండాలి.
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మారాలి.
అనుకున్న లక్ష్యాలు సాధించాలి.
చూడచక్కని తెలుగు సున్నితంబు.

కామెంట్‌లు