పొడుపు కథలు.; -తాటి కోల పద్మావతి గుంటూరు.

 ఒక గుడ్డు కు 20 మంది పిల్లలు.
జవాబు. వెల్లుల్లి గడ్డ.
అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది.
జవాబు. మనసు.
పందిరి కింద పంగ నామాలవాడు.
జవాబు పొట్లకాయ.
మా తాత కు ఉన్నది కానీ మా అవ్వ కు లేదు.
జవాబు. మీసం.
రెక్కలు లేని పక్షి ఆకాశాన ఎగురుతుంది తోక ఉంది కానీ కోతి కాదు.
జవాబు. గాలిపటం.
వేయికాళ్ల venga రాయుడికి చేతులు లేవు మీసాలు ఉన్నవి.
జవాబు కాళ్ళ జెర్రీ.
సమంతకు వచ్చేది రెండు వర్గాల వారే. ఎవరు వారు.
జవాబు. కొనేవారు అమ్మేవారు.
మాటలన్నీ మూటగట్టి మాని మీద పెడతారు అవసరానికి మూట దింపుతారు.
జవాబు. పుస్తకం.
రూపం ఉంది అందం ఉంది హృదయం లేనిది.
జవాబు. శిల్పం.
సింగారాల సుందరాంగిని లేరు పట్టుకోలేరు.
జవాబు. లేడీ.
మా తాత ఏటి కవతల తాటి ఆకుల పాలెం పోయి 3 ఎద్దులు తెస్తే 1 తేలుతుంది ఒకటి మునుగుతుంది ఇంకొకటి కలుగుతుంది.
జవాబు. ఆకు, ఒక్క, సున్నం.
కామెంట్‌లు