సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి.; -తాటి కోల పద్మావతి గుంటూరు.

 భోగి అంటే సుఖం కలది.
మకర సంక్రమణానికి వెనుకటి 30 రోజులు ధనుర్మాసం అంటారు. అప్పుడు సూర్యుడు ధనురాశిలో ఉంటాడు. ఈ ధనుర్మాసం 30 రోజులు భక్తులు తెల్లవారుజామునే మేల్కొని స్నానం కావించి దేవాలయాల్లో పూజలు భజనలు నిర్వహిస్తారు. గ్రామాల్లో భజనలు చేస్తారు. చలికాలం కనుక భోగి మంటలు వేస్తారు. ఈ మంటల్లో పాత వస్తువులు చేటలు మొదలగునవి వేస్తారు. సంక్రాంతి నుండి డి కొత్తవి వాడతారు. ఇంటి ముందు అలికి అందంగా ముగ్గులు వేస్తారు . ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి వాటిపై గుమ్మడి పూలు ఉంచి పసుపు కుంకుమలు పెట్టి నమస్కరిస్తారు. వీటిని గొబ్బి ముద్దలు, గొబ్బెమ్మలు అంటారు.
భోగి పండుగ అ ఇంద్రుని ప్రీతి కొరకు చేసే పండుగ అని కూడా అంటారు. భోగం అంటే సుఖం. గోదాదేవి మకర సంక్రాంతికి ముందు రోజు శ్రీరంగనాథునిలో వివాహ సంబంధమైన ఐక్యం చెంది, భోగం పొందింది. కానీ ఒక ఆ రోజును భోగి పండుగ అ అనే ఆచారం ఏర్పడింది. భోగి నాడే శ్రీ శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం జరుపుతారు. ఈరోజు కొత్తబియ్యం కొత్త బెల్లం తో భోగి పొంగలి చేస్తారు. దేవునికి సమర్పించి భక్తిప్రపత్తులతో ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
తెల్లవారుజామున వేడినీళ్లతో తలంటు స్నానం చేయడంతో గత ఆరు మాసాల పీడ జీవితం సమసి పోయిందని భోగి నుంచి ఆనందమయ జీవితం మొదలైందని భావిస్తారు. వరి కంకుల తోరణాలతో ఇల్లు అలంకరిస్తారు. సాయంకాలం పిల్లలకు పేరంటం చేసి, రేగి పండ్లు, చెరకు ముక్కలు తలపై పోస్తారు. దీన్నే భోగి పండ్లు పోయడం అంటారు. ఇందువల్ల పిల్లలకు ఆరోగ్యం ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం.
ఇలా భోగి పండుగ మానవులకు ప్రీతికరమైన పండుగ.
కామెంట్‌లు