దత్తపది; సాహితీసింధు సరళగున్నాల

 దత్తపది:
అలుపు
సొలుపు
మలుపు
కొలుపు పదాలతో 
-------------------------
మ*అలుపున్బొందక బోధజేయ వినరే యాశీస్సులెట్లిత్తు మా
సొలుపున్గాంచక విద్యపట్ల విలువన్ జూపించరైరేమిటో
మలుపున్దిప్పెడి శక్తిగల్గు చదువున్ మానంగబుద్ధేల ?మేల్
కొలుపున్ జేయర భావిజూపి శివుడా కోర్కెల్ సదా దీరగా
కామెంట్‌లు