బొల్లాప్రగడ ఉదయ భాను తో నెల్లుట్ల సునీత ముఖాముఖి
 ప్రశ్న : మీ పరిచయ హృదయావిష్కరణ చేయగోర్తాము. 
నేస్తాలు అందరికీ నా శుభాభినందనలు.
నా గురించి ఓ నాలుగు మాటలు మీతో ఈ విధంగా పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ప్రశ్న : మన సాహితి బృందావన జాతీయ వేదిక ఆత్మీయ  సభ్యులకోసం మీ గురించి నాలుగు మాటలు... 
మీ మాటల్లో ...
 నేను బొల్లాప్రగడ ఉదయ భాను
మా వారు B.V.V.S.నారాయణ గారు. R T C లో చేసేవారు.
నాకు ఇద్దరు అబ్బాయిలు . సూర్య తేజ, శరత్ చంద్ర . సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెద్దబ్బాయికి పెళ్ళయ్యింది. కోడలు పూజా బంగారు తల్లి.
 తల్లిదండ్రులు :  కీర్తిశేషులు తురగా సూర్యనారాయణ గారు , శ్రీమతి విజయశారద 
స్వస్థలం, : తాడేపల్లిగూడెం 
కుటుంబ నేపద్యం : నాన్నగారు R T C లో T I _2 గా చేస్తూ కాలం చేసారు. అమ్మ 1959 లో S S l C
ఇతర వివరాలు :
నేను M.A హిందీ లిటరేచర్, M.A.ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను
B.ed సోషల్ & ఇంగ్లీష్
స్టేట్ బోర్డ్ ఇంగ్లీష్ టీచర్ గా ,14 సంవత్సరాలు,
CBSE  Social teacher గా 12 సంవత్సరాలు బోధనానుభవం కలిగి యున్నాను.
ప్రశ్న : మీ విద్యాబ్యాసం ఎక్కడ జరిగింది.
ప్రైమరీ స్కూలింగ్  ఆ రోజుల్లో అంటే 70 వ దశకంలో అరవింద విద్యా నికేతన్ ,భీమవరం. ప్రైవేట్ పాఠశాల. 
హైస్కూల్ విద్య పంచాయతీ, పంచాయతీ సమితి పాఠశాలల లో జరిగింది.
ఇంటర్ _శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ
నాన్న గారి అకాల మరణంతో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్  ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా 
ప్రశ్న : ఎలా సాగింది?
 
భలే వుండేది. చిన్నతనంలో అందరూ కలిసి ఉండే వాళ్ళం. పోటీ పడి చదివే వారం. ఆటలు పాటలు అయితే చెప్పక్కరనే లేదు.
ప్రశ్న : మీ బాల్య స్మృతులు నెమరు వేస్తారా? 
హా ... తప్పకుండా 
నేను బాగా కబుర్ల పోగుని. 
ఫ్రెండ్స్ తో ఎక్కువ గడిపే దాన్ని.
 కథల పుస్తకాలు చదివే దాన్ని. ఎంత ఇష్టం అంటే గేమ్స్ పీరియడ్ లో స్కూల్ లైబ్రరీ లో బుక్స్ చదివేదాన్ని. అంతే కాదు మా చిన్నప్పుడు పుస్తకాలను అద్దెకు ఇచ్చేవారు . ఆ పుస్తకాలు తెచ్చుకుని నేను చదవడమే కాకుండా నా ఫ్రెండ్స్ కి కూడా ఇచ్చి చదివించే దాన్ని.
ఏ పోటీ పెట్టినా మా మాస్టర్లు నా పేరు ముందే నన్నడగకుండానే నోట్ చేసేసే వారు . అంత నమ్మకం నేనంటే.
 ప్రశ్న : మీ వృత్తి  ఏమిటి ..  ప్రస్తుతం ఏమి చేస్తున్నారు?
నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ గా 25 సంవత్సరాల పైన పనిచేసాను.
ఇప్పుడు పిల్లలు ప్రయోజకులై ఇంక చాలించు విశ్రాంతి తీసుకో అన్నారని ప్రజెంట్ నా విశ్రాంత సమయాన్ని ఆస్వాదిస్తున్నాను.
ప్రశ్న : కుటుంబం అంటే ఎలా ఉండాలి....
డబ్బుకు కాక బంధాలకు విలువ నివ్వాలి. ఆత్మీయంగా ఉండాలి.
కోపాలు తాపాలు ఉంటే మనసులో పెట్టుకుని కుమిలి పోకుండా అప్పటికప్పుడు తేల్చేసుకుని అరమరికలు లేకుండా కలిసిపోవాలి. 
ప్రశ్న :  మీ ప్రవృత్తి ఏంటి? 
*Read Read Read అని పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడైతే రోడ్డు మీద నడుస్తూ ఉంటే కాగితం కనిపించినా టక్కుమని పైకి తీసి చదివేసేదాన్ని.
 ప్రశ్న :  మీ అభిరుచులు ఏంటి ? 
కథలు చదవడం. సిల్లీగా కథలు చదవడం ఏంటి అనుకుంటున్నారా ? నాకు ఇప్పటికీ రాజకుమారి  మాంత్రికుడు, రెక్కల గుర్రం మీద రాజకుమారుడు వచ్చి మాంత్రికుడుని చంపి రాజ కుమార్తె ను కాపాడి పెళ్ళి చేసుకోవడం , కాశీ మజిలీలు, సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి కథలు చదవడం చాలా చాలా ఇష్టం.
పాటలు వినడం , పాడటం
*మనసు స్పందించినపుడు ఏదైనా రాయడం.
ప్రశ్న :  మీరు ఎన్నుకొన్న  వృత్తి, ప్రవృత్తి ఇప్పుడు ఎలా ఉంది?  
విశ్రాంత జీవనం కాబట్టి ప్రశాంతంగా చదవడం , రాయడం దట్సాల్.
ప్రశ్న :  మీరు వృత్తిలో ప్రవృత్తిలో ఏలా ప్రవేశించారు? ఎప్పటి నుంచి ఎన్ని కొనసాగుతున్నారు?
 
నేను 1990 లో  ఒక ప్రైవేట్ స్కూల్ లో హిందీ టీచర్ గా జాయిన్ అయ్యాను. తర్వాత వేర్వేరు స్కూల్స్ లో నా క్వాలిఫికేషన్, స్కూల్ యాజమాన్యం అవసరత రీత్యా ఇంగ్లీష్, సోషల్ డీల్ చేసాను.
ప్రశ్న : మీ వృత్తి, ప్రవృత్తిలో అనుభవాలు ఏమిటీ ? 
Transfer of Knowledge.
తెలియంది తెలుసుకోవడం
మనకు తెలిస్తే ఇతరులు మనని అడిగితేనే వారికి చెప్పడం.
ప్రశ్న : మీరు జీవితంలో చేదు అనుభవాలు వున్నాయా? 
జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. సో ఉండొచ్చు.
ప్రశ్న :  ఎలాంటివి చవి చూశారు? 
నాకు ప్రజా సేవ చేయడం అంటే చాలా ఇష్టం. సో దానికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ వుంటే బాగుంటుంది అని ఒక జాతీయ పార్టీ టికెట్ పై కౌన్సిలర్ గా కాంటెస్ట్ చేసాను. నాకు పరిణతి లేక పోవడం వలన ఏమనుకున్నాను అంటే  నిజాయితీగా సేవ చేస్తాం అంటే ఓట్లు వేస్తారు అనుకున్నా. కాకపోతే పేర్లున్న లిస్ట్లు ఇంటింటికీ పంచుతున్నప్పుడు మా ఓటు ఇక్కడ ఉందంటూ కొందరు నా వెనుకే వచ్చారు.దెబ్బకి భ్రమలు తొలగి వాస్తవం కళ్ళ ముందుకు వచ్చింది.
ఇది చేదు అనుభవం కాదు కానీ కనువిప్పు కలిగించిన ఘటన.
ప్రశ్న : మీ అంతరంగం లో మెదిలిన సందేశాలు, సలహాలు ఏమిటి..
*ఓటును నోటుకు అమ్ముకుంటే మన ఐదేళ్ల జీవితం తాకట్టులోకి
పోతుంది .
* మనం ఎవరినైనా నమ్మి మోస పోయాం అంటే మనని మోసం చేసిన వారిది కాదు ఆ తప్పు వారు మోసం చేసేంతగా నమ్మిన మనదే తప్పు.
ప్రశ్న : మీరు ఈ సమాజంలో అనేక రకాల మనుషులు  వుంటారు కదా!. 
వారి మనస్తత్వంలను మీరెప్పుడయినా గమనించారా? 
మన చేతి 5 వేళ్ళే ఒక్కలా వుండవు అలాంటప్పుడు అందరూ ఒకే రకమైన మనస్తత్వం ఏ విధంగా కలిగి ఉంటారు? మన కుటుంబంలోనే ఏ ఇద్దరు ఒక రకంగా ఆలోచించరు కదా !
నాకు తెలిసీ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాళ్ళు, సీరియస్గా వుండే వాళ్ళు.
నమ్మించి మోసంచేసే వాళ్ళు , నమ్మి మోసపోయే వాళ్ళు 
ప్రశ్న : వ్యక్తిగతంగా మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అలాంటి వారి గురించి?...
 
ఏం అడుగుతారు లెండి రెండో జాబితాలో వున్నాను. ఎన్ని ఖాజాలు తిన్నా  బుద్ధి రాదు. మళ్ళీ మళ్ళీ వెర్రి గొర్రెలా వాళ్ళు పలకరిస్తే చాలు వెళ్ళి పోతా అన్నీ మర్చి పోయి.
ప్రశ్న : మీకు ఏఏ రంగాలలో ప్రవేశం ఉంది?
 కథలు , కవితలు రాస్తాను , పాటలు పాడతాను.
ప్రశ్న : మీకు సామాజిక, సాహిత్యం రంగాలపై మీకు అభిరుచి ఎలా ఏర్పడింది?
మా బామ్మ గారు, మా తాత గారి నుంచి వచ్చాయి. మా తాత గారు మాకు రాత్రి కథలు చెప్పే వారు, వయొలిన్ , ఫ్లూట్ , హార్మొనీ వాయిస్తూ పాటలు పాడేవారు. నాన్నగారి  నాన్నగారు పేరు సోమ రాజు గారు, ఇక మా బామ్మ గారు పుస్తకాలు , పేపర్లో డైలీ సీరియల్ (ఆంధ్ర ప్రభ )చదువుతూ  మా చేత కూడా చదివించే వారు.ప్రతినెలా చందమామ , విజయ చిత్ర, యువ పుస్తకాలు వచ్చేవి, ప్రభ , పత్రిక వార పత్రికలు, జ్యోతి చిత్ర కూడా తెప్పించేవారు.
ప్రశ్న :  కవిత్వం అంటే మీదృష్టిలో నిర్వచనం ఏవిధంగా చెపుతారు? 
 *మనసు స్పందించినపుడు రాసేది.
* మనుషులలో మార్పు తెచ్చేది.
సమాజాన్ని ప్రతిబింబించేది.
* సమాజ శ్రేయము కోరేది.
ప్రశ్న : మీరు రాసిన, మీకు నచ్చిన కవిత ఒకటి చెప్పండి...
 కాకిపిల్ల కాకికి ముద్దు అని నేను రాసిన కవితలు అన్నీ నాకు ఇష్టమే. అయితే...
ఈ మధ్య కాలంలో వాగ్దేవి కళా వేదిక వారు కూరపాటి న్యస్తాక్షరిలో వ్రాయమన్నారు. ఈ కవిత వాస్తవానికి అద్దం పడుతుంది అనిపిస్తుంది.
(కూ)రిమి ఉన్న వేళ నేరములు తోచవెవ్వరికి
(ర(సవంతంగా సాగు దినములు నెయ్యమున
(పా)లకుండలో ఉప్పురాయి పడినట్టు  దూర్తుడొకడు జొచ్చిన
అంత(టి) మైత్రి ఆవిరై పోవు

ప్రశ్న :  ఎలాంటి కవిత్వం మీరు ఇష్ట పడుతారు ? 
భావ కవిత్వం
నేను బాగా ఊహ తెలిసిన తర్వాత మొట్ట మొదట చదివిన పుస్తకం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం
ప్రశ్న :  మీరు కవిత్వం ఎప్పటి నుంచి రాస్తున్నారు ?
 రాయటం ఏమో గానీ నా తొలి కవిత ప్రజా శక్తి అనే పేపర్లో  కవితా వాణి అనే కలం పేరుతో 1994 లో ప్రచురితమయింది. తర్వాత గోదారి కమలం అనే లోకల్ పేపర్లో ఉదయ భాను పేరుతోనే మరొకటి ప్రచురించబడింది. అడపా దడపా రాసినా ఎక్కువగా వ్రాయడం మాత్రం లాక్ డౌన్ వచ్చినప్పటి నుంచే విజ్జేశ్వరం లాకులు ఎత్తితే నీటి ప్రవాహం పోటెత్తినట్టు హిడెన్ టాలెంట్స్ వెలికి వచ్చాయి.
ప్రతిలిపి అని self publishing app లో సుమారు 300 వరకు కథలు , కవితలు వున్నాయి.
ప్రశ్న :  ఏఏ సాహితీ ప్రక్రియలు యందు తమకు అవగాహన, అనుభవం వుంది? 
 *రాజశ్రీ, సాహిత్య సృజన, సున్నితములు, శ్రీ పదాలు ఇవి పద ప్రక్రియలు
** వీటిలో సున్నితములు, సాహిత్య సృజన  మకుటంతో కూడిన సరళ శతకములు.
*హరివిల్లు, తేనియలు, మధురిమలు మాత్రా ఛందస్సుతో
ఉ తె రసం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తొణుకులు, నందనాలు, ప్రతీకలు, (అక్షరాల సంఖ్యతో)  పరిమళాలు ( గేయ ) ఇత్యాది ప్రక్రియలలో కృషి చేసినాను.
ప్రశ్న :  మీరు రాసిన ఏఏ రచనలు పుస్తక ప్రచురణలు నోచుకొన్నాయి? 
 పుస్తకం ప్రచురితం కాలేదు. సంకలనములలో చోటు చేసుకున్నవి.
ప్రశ్న :  మొదటి పుస్తకం ఏది? 
ఇంకా ప్రచురించలేదు.
ప్రచురిస్తాను త్వరలో ఈశ్వర శతకం .
ప్రశ్న : మీ రచనలు యెక్కడెక్కడ ప్రచురణ అయ్యాయి?
 
 ప్రజాశక్తి, గోదారి కమలం, తెలుగులోకం, నేటి నిజం, తరణం, నేనుసైతం కవి పత్రిక, ఉదయం, మహిళ మార్గదర్శి
ప్రశ్న :  బహుమతులు, అవార్డులు వేటికి లభించాయి? 
 రాజశ్రీ, సున్నితం , హరివిల్లు _ కవిమిత్ర, శత తేనియ పురస్కారము, కవన అద్వైత, బ్రహ్మాస్త్ర ఇంకా వున్నాయి.
ప్రశ్న : మహిళలకు స్వాతంత్ర్యం, ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంత వరకు అవసరం? 
 Right to Freedom మన రాజ్యాంగం లింగ వివక్షత చూపకుండానే ఇచ్చింది . కాకపోతే ఆడవారి పై ఆంక్షలు కుటుంబం , సమాజం విధించింది. స్త్రీకి స్వేచ్ఛ అవసరమే కానీ కొన్ని పరిమితులకు లోనై ఉండటం భద్రతా రీత్యా మంచిది.
కానీ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సిద్దించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
**ఆడవారికి. ఆర్థిక స్వాతంత్ర్యం ఖచ్చితంగా కావాలి.
ప్రశ్న :   ఇప్పుడు మహిళలకు స్వేచ్చ వుందా? 
 గతంతో పోలిస్తే వుంది. విద్యా , ఉద్యోగాలలో...
ప్రశ్న ఎలాంటి స్వేచ్చ కావాలి? 
 స్వేచ్ఛ  మితిమీరకుండా అంటే పిచ్చివాడి చేతిలో రాయిలా కాకుండా వుండాలి.
ప్రశ్న : ప్రేమ, పెళ్లి సంస్కృతి, సంప్రదాయాలపై మీ అభిప్రాయం? 
  ప్రేమ : ఎదుటి వారి మంచిని మాత్రమే కోరుకునేది.ప్రేమిస్తే ఇరుపక్షాల పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకోవాలి. బ్రేకప్ అయితే సామరస్యంగా విడి పోవాలి.
యాసిడ్ దాడులు, ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలకు పాల్పడి తల్లితండ్రులను  క్షోభకు గురి చేయడం కరెక్ట్ కాదు.
పెళ్ళి : రెండు కుటుంబాలకు సంబంధించినది. నమ్మకమే పునాదిగా, పరస్పర అవగాహనతో సాగాలి.
సంస్కృతి : అందుతోంది తరం నుంచి తరానికి. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా ఉన్నతమైనవి .  ఈ  నిజాన్ని కరోనా సమయంలో ప్రపంచ దేశాలే ధ్రువపరిచాయి.మనం కూడా పెద్దల బాటలోనే నడచి భావి తరాలకు అందిద్దాం.
ప్రశ్న :  ప్రస్తుత వ్యవస్థలో టీవీలు, సినిమాలు, మీడియా, మొబైళ్ళ వల్ల  పిల్లలపై ఏలాంటి ప్రభావం వుంది ?
పిల్లల మీద అని ఏముంది పెద్దల మీద కూడా...
కొన్ని సినిమాలు ఫ్యామిలీ తో చూడలేని స్టేజ్ ఎప్పుడో దాటేసాయి.
నా మట్టుకు నాకైతే తెల్లవారడం, పొద్దుగూకడం రెండూ ఫోన్ తోనే
చిట్టి చరవాణి మాయ చేసేసింది.
 
ప్రశ్న: పసి వయస్సు ఆడ పిల్లల వయసు పైబడిన ముసలవ్వ దాకా పైశాచికంగా మృగాల అత్యాచారాలపై మీ స్పందన తెలపండి? 
ఒక్కమాటలో చెప్పాలంటే చంపేయాలి అలాంటి వారిని.

ప్రశ్న :  ఈ ఆధునిక కాలంలో ఎలాంటి మార్పులు కోరుకొంటున్నారు? 
 సౌకర్యాలు పెరగడంతో శారీరక శ్రమ లోపంతో, విద్యా ఉద్యోగాలలో ఒత్తిడి పెరగడంవలన అనారోగ్య సమస్యలు , ఊబ కాయం వంటి ఇబ్బందులు అధిగమించటానికి
ఆరోగ్యం పై శ్రద్ద, చిన్ని చిన్ని వ్యాయామాలు , మెడిటేషన్ లాంటివి అలవరుచుకుంటే బాగుంటుంది. 
* నలుగురితో  కలిసుండటం.
ఇది కూడా ముఖ్యమేనని నా అభిప్రాయం.

ప్రశ్న : మార్పులు రావాలంటే ఏం చేయాలి? 
 సంకల్పం దృఢంగా వుండాలి. తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో పెట్టే ఓర్పు నేర్పు కావాలి.
ప్రశ్న : కొత్తగా సాహితీ బృందావన జాతీయ వేదిక   నిర్వహించే ముఖాముఖిపై మీ అభిప్రాయం ఏమిటీ?
 
 చాలా బాగుంది.
మనసులోని భావాలు పంచుకోవడానికి మంచి అవకాశం. ఇలాంటి కార్య క్రమం ఇంత వరకూ ఎవ్వరూ నిర్వహించలేదు.
కొత్త కొత్త ఆలోచనలు, అమలు పరిచే నేర్పు సునీతకు మాత్రమే సొంతం.
ప్రశ్న : ఈ ముఖాముఖి పై మీ అభిప్రాయం ఏమిటి ? 
 చాలా చక్కటి కార్యక్రమం.
ఓపెన్ ఆప్ అయ్యే సదవకాశం ఇచ్చిన శ్రీమతి నెల్లుట్ల సునీత గారికి అభినందనలు చెప్పడం మినహా ఏమివ్వగలం. చిన్న వయసులోనే చక్కటి సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టి  అవార్డ్స్ ఇవ్వటం , క్యాష్ప్రైజ్ తో ప్రోత్సహించడం , స్వీయ సంపాదకత్వం తో కవితలను గ్రంధస్థం చేయడం వంటి కార్య క్రమాలతో ఎందరినో కవులను, కళాకారులను  ప్రోత్సహిస్తున్నది.
ఆమె కృషి శ్లాఘనీయం, స్పూర్తి దాయకం.
God bless You Suniitha 💐💐💐
**
ధన్యవాదాలు


కామెంట్‌లు