ఆ నాదం సామవేదం!;--డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 175వ త్యాగరాజ ఆరాధనోత్సవాలుసందర్భంగా-----
================================
1.సమయానికి,
               తగుమాటలాడాలి!
   జీవితం తగవులా,
     తెలిసికుంటే నగవులే కదా!
   మనిషి నోటి మాట,
                  రామ  రావాలి!
   అతడు నడిచే బాట,
                   గీత కావాలి!
2.గళాలన్నీ ఒక్కటై,
              ఆలాపించే కీర్తన!
    జగదానందకారకమే!
    జనకల్యాణదాయకమే!
   నాదలోకసందర్శనమే!
3.సప్తస్వరాలు ప్రవహిస్తాయి!
  వాయిద్యాలు పులకరిస్తాయి!
  వయోభేదం లేని అద్భుత,
                 సంగీతవిన్యాసం!
  మౌనంగా వింటూ సాగే,
                 కావేరి ప్రవాహం!
   దృశ్యం నేత్రానందం,
          శ్రుతం పరమానందం!
4."ఎందరో మహానుభావులు!"
     అన్న మహానుభావుడతడే!
  సంగీతస్వరబ్రహ్మమే అతడు!
  ఇలనడిచిన,
      సామవేదరూపమే అతడు!
సంగీతానికి అయ్య త్యాగయ్యే!
5."రామ"  అద్వైతం!
   త్యాగరాజు అద్వైతసాకారం!
   ఆ ఆరాధనం!
 మానవజీవనరథ ఇంధనం!
మోక్షపథగమన,
               అనన్య సాధనం!
---------------------------------------

కామెంట్‌లు
p v s l Srirama Murty చెప్పారు…
త్యాగరాజ ఆరాధనం మానవజీవనపధఇంధనం
మోక్షపధగమనఅనన్యసాధనం అధ్భుతంగా, లోతైనఅవగాహనయుక్తంగా ఉంది.
సంగీతానికి, భక్తికి, ఙ్ఞానానికిఉన్నమూలసంబంధాన్ని ఉటంకిస్తోంది.చాలా బావుంది
అజ్ఞాత చెప్పారు…
త్యాగరాజఆరాధనం
మానవజీవనరధ ఇంధనం
మోక్షపధగమన అనన్యసాధనం
అధ్భుతంగా ఉంది.
సంగీతానికి,భక్తికి,ఙ్ఞానానికి ఉన్నసంబంధాన్ని లోతైనఅవగాహనను సంయుక్తంగా సంక్షిప్తంగా ఆవిష్కరించింది.
చాలా చక్కని కవిత సంధర్భోచితంగా.