ప్రకృతి అందాలు ;-జోషి మైత్రేయి;-;-కలం స్నేహం
 చల్లని నిశి వేళలో వెలుగు జిలుగుల జాబిల్లి వైపే చూస్తుంటే..
చీకటిని చీల్చుకొని నులి వెచ్చని ఉదయకిరణం కంటి పాపలో వెలిగింది.
చల్లని గాలి కర్ణామృతమైన నిద్రను కితకితలు పెట్టి మేలుకొలిపింది..
చెట్లన్నీ పచ్చని చిగుర్లు తొడిగి పువ్వులన్నీ అవని తల్లికి అక్షింతలై రాలాయి..
చిగురాకుల మధ్య చిలకలు చెలి తోటి గూడి ముద్దు మురిపాల ముచ్చట్లతో ఆనందిస్తున్నాయి..
చిరు చిగుర్లను ఆరగించిన సీతాకోకలు మధురమైన గాన లహరితో మత్తెక్కించి వీనుల విందును చేస్తున్నాయి..
చూప్పనాతి గండుతుమ్మెదలు రోదలతో పూబాలాల చెంతకు చేరుతున్నాయి..
చిరుగాలి మనసు పొరల్ని ముగ్ద మనోహరంగా తాకుతుంది..
చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి విరుపులు చూసి మనసు నిండా హర్షాతిరేకాన్ని నింపేసింది..

కామెంట్‌లు