ఆశాజ్యోతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 పాండోరా ఎపిమెథస్ అనాధ పిల్లలు. ఎపిమెథస్ గుడిసె లో ఆపిల్ల ఒక చెక్కపెట్టెను చూసింది. "అందులో ఏముంది?"కుతూహలంగా అడిగింది. "నాకూతెలీదు.అదిరహస్యం.నీవు అడగకూడదు." "నీకు ఎవరిచ్చారు?" "అదీ రహస్యం!" " ఛఛ అసహ్యంగా అడ్డంగా ఉంది ఆపెట్టె"చిరాగ్గా అంది ఆపిల్ల."అబ్బ!దాని గొడవ వదిలేయి.పద హాయిగా ఆడుకుందాం!" బైట బోలెడు మంది పిల్లలు కేరింతలు కొడుతున్నారు. అమ్మా నాన్నలతో పనిలేని రోజులు అవి.పళ్లు  తాజా కూరలు చెట్లనించి సరాసరి తెంపుకుని తినేవారు. కొట్టుకోవటం తిట్టుకోవడం తెలీని అమాయక పిల్లలు! పండోరాకు ఆపెట్టె తెరిచి చూడాలి అనే ఆత్రుత రోజు రోజుకి పెరిగిపోతోంది. ఎపిమెథస్ ని రోజూ సతాయించేది"పెట్టె తెరచి చూస్తాను"అని."వద్దు!నేను చెప్పిన మాట విను.హాయిగా ఆడుతూ పాడుతూ పళ్ళు తిందాం. పూలదండలుకడదాం." "నీకు ఎప్పుడూ ఆటలు తిండి తప్ప వేరే పనిలేదు. ముందు నాకు ఆపెట్టె తెరిచి చూపుతావా లేదా?" మొండి కేసింది."ఎవరో ఒక వ్యక్తి తెచ్చి పెట్టాడు దాన్ని. అతనే వచ్చి మూతతెరిచి చూపేదాకా మనం ముట్ట గూడదు."ఖచ్చితంగా చెప్పి బైటి కి వెళ్లి పోయాడు. పండోరా మహామొండిది.ఆపెట్టె ను తనే తెరవాలనుకుంది.దాని మూతకి తాడు బిగించి కట్టి ఉంది. పెట్టెను ఎత్తబోయింది.అమ్మో!బోలెడంతబరువు.లోపలినుంచి సన్నగా శబ్దాలు వినపడటం తో ఆమె లో కుతూహలం ఎక్కువ ఐంది. పండోరా!మూత తీయి.మమ్మల్ని చూద్దువుగానీ!" తాడు ముడి విప్పసాగింది.ఎపిమెథస్ బైట ఆడుతూ ఉన్నా మనసంతా  ఏదో కలవరం గందరగోళం! అతను గబగబా లోపలికి వచ్చేటప్పటికి పండోరా పెట్టెమూతతెరవటం లెక్క లేనన్ని రెక్కల పురుగులు ఫౌంటెన్లాగా పైకి ఎగిరి కుట్టసాగాయి.బజ్ మని శబ్దం చేస్తూ రెక్కలున్న గబ్బిలాలవంటి ప్రాణులు ఇద్దరినీ కుట్టసాగాయి. అవి నిజానికి పురుగులు కాదు. మనబాధలు కష్టాలు  చెడుభావాలు!మెర్కురీ అనే దేవత ఇచ్చిన పెట్టెను తెరచి పండోరా తనుతీసుకున్న గోతిలో తానే పడింది. ఆపిల్లలిద్దరూ బాధగా కుయ్యోమొర్రో అని ఏడుస్తూంటే ఓ కమ్మని స్వరం వినపడుతుంది. "కాస్త మూతతెరవవూ?" చాలా సేపు బ్రతిమాలాక ఆపిల్లలు మూతతెరవటంతో ఓ అందమైన దేవకన్య బైటికొచ్చి ఇద్దరినీ ముద్దు పెట్టుకుంది."నాపేరు ఆశ! కష్టాలు బాధలనే విషపు పురుగులు  మనుషుల్ని సతాయిస్తుంటే నేను వచ్చి ఓదారుస్తాను.   మీరు బతికి ఉన్నంతకాలం మీతోపాటు ఉంటాను.నేను మిమ్మల్ని ఎప్పుడూ విడిచి పెట్టి వెళ్లను.మీలో నిరంతరం వెలిగే ఆశాజ్యోతిని."అప్పటి నుంచి మనిషికి కష్టాలు ప్రారంభమైనాయి.అందుకే దైవస్మరణ సదా చేస్తూంటే అవి దూరం అవుతాయి. ఏమతం చెప్పినా అదే!దైవప్రార్థన పరోపకారం మంచి మార్గం లో నడిస్తే చాలు. ఇన్ని పూలు పళ్లు  కొబ్బరికాయలు అవసరంలేదు. భక్తితో  ఫలం పత్రం పుష్పం తోయం అన్నారు అందుకే 🌹
కామెంట్‌లు