పాపాయి పుట్టిన రోజు-బాల గేయం;-ఈర్ల సమ్మయ్య టీచర్;- Cell 9989733035
పాపాయి పుట్టిన రోజు
పలువురు మెచ్చినరోజు
అందరికీ పండుగ రోజు
ఆనందము పంచే రోజు 

వేకువనే  లేచిన  రోజు
వేదాలు వల్లించిన రోజు
వేనోళ్ళ పొగిడిన రోజు
వేదనలు తొలగిన రోజు

తల్లి సంతోషించు రోజు 
తండ్రి కానుకిచ్చు రోజు
ఇంటి నలంకరించురోజు
ఇలవేల్పుదీవించినరోజు

ఆశలు చిగురించిన రోజు
ఆశయం నెరవేర్చు రోజు
పెద్దలు  దీవించు  రోజు
ముద్దుగముస్తాబైన రోజు

అందరూ  వచ్చిన  రోజు
ఆపదలు  తొలగిన రోజు
మిఠాయిలుపంచిన రోజు
మిత్రులను కలిసిన రోజు కామెంట్‌లు