చెల్లి పెళ్లి - గేయం;-- ఈర్ల సమ్మయ్య టీచర్MPPS శ్రీరాంపూర్ ఎస్సీకాలనీగ్రామం & మండలం శ్రీరాంపూర్పెద్దపల్లి జిల్లా, తెలంగాణ సెల్: 9989733035
చెల్లి మల్లికి పెళ్ళంట
చిల్లి గవ్వ లేదంట
గల్లి అంతా అడిగెనట
డబ్బులెక్కడ లేవంట

తల్లి బాగా ఏడ్చేనట
తండ్రి బాధ పడేనట
పెళ్లికి పెద్దలు వచ్చేరంట!
అందరు దయచూపేరంట!

డబ్బు సాయం చేసేరంట
పెళ్లి గొప్పగ జరిగేనంట
మల్లి సంతోషించే నంట
జనం వారిని మెచ్చేరంట

జగతిలో కీర్తి పొందేరంట
ఉదారతను చూపాలంట
ఆపదలో ఆదుకోవాలంట
అందరిమదిలో నిలవాలంట


కామెంట్‌లు
ANKARI PRAKASH చెప్పారు…
సూపర్ చాలా బాగుంది..