సంక్రాంతి పండుగ (గేయం);-ఈర్ల సమ్మయ్య టీచర్,MPPS శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీగ్రామం&మండలం శ్రీరాంపూర్జిల్లా పెద్దపల్లి, తెలంగాణ
సంక్రాంతి పండుగ 
సకలజనుల పండుగ 
సంతోషం మెండుగ 
సాగవలెనీ పండుగ
 
ముత్యాలముగ్గులు 
ముచ్చటైన రంగులు 
వేసేటి పడుచులు 
చూసెనులే పెద్దలు 

గంగిరెద్దుల ఆటలు 
గగనాన పతంగులు
బడిపిల్లల అరుపులు
ఆనందపు కేరింతలు
 
పాల మీగడనురగలు
చెరకు తీపి గుర్తులు 
మధురానుభూతులు 
చెరగనివీ జ్ఞాపకాలు


కామెంట్‌లు