ఎగిరింది-మువ్వన్నెలజెండా -(బాలగేయo);-పోతుల చైతన్య భారతిహైదరాబాద్7013264464
పల్లవి:
అదిగదిగో ఎగిరింది
మువ్వన్నెల జెండా
భరతమాతగుండెల్లో ఆనందనిండా... lఅదిగదిగోl

1)చరణం:
అహర్నిశలు నాయకులు
పోరాటం చేయంగా
త్యాగాలతో జీవితాలు
సమిధలుగా మారంగా.. 
ఒంటిలోని నరాలన్ని
ఉక్కువోలె బిగియించి..2
బానిస సంకెళ్ళన్ని
సమరంతో త్రుంచంగా..lఎగిరిందిl

2)చరణం:
సత్యం,శాంతి,అహింసలు
ఆయుధంగ సాగినా
దశాబ్దాల ధర్మపోరుతో
తడబడె తెల్లదొరలు.. 
దేశభక్తి పౌరుషంతో
ఉరికొయ్యల తలదన్ని..2
ప్రాణాల్ తృణప్రాయంగా
అమరులైన వీరులది..lఎగిరిందిl

3) చరణం:
అర్ధరాత్రి అపూర్వoగ
నవోదయం తొడిగింది
ఆశయాలు నెరవేరగ
నిశీథిని తరిమింది...
భరతావని ఎదలోతున
మధురమైన భావనలు..2
ప్రజలందరి మోములోన
సంతోషం నింపంగా..lఎగిరిందిl

4) చరణం:
అవినీతికి అగ్గిపెట్టి
స్వార్థపరుల నిర్జించి
దేశకీర్తి భావుటలై
సగర్వoగ సాగుదాం..
మహనీయుల స్ఫూర్తితో
మాతృదేశ సేవజేయ..2
సోదర సమభావనలు
ప్రగతికి అడుగులు వేయగ... lఎగిరిందిl
కామెంట్‌లు
Unknown చెప్పారు…
Excellent madem