తా వాణి:అనుద్వేగకరం వాక్యo!"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
  👌సత్యము, ప్రియము, హితము,
      స్వాధ్యాయము, పఠనము,
      వాచిక మగు తపస్సు!
                ఓ తెలుగు బాల!!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌వాచిక తపస్సు అనగా.. మంచి మాటలు పలుకు నప్పుడు; పరుల మనస్సులకు నొప్పి కలుగకుండా, ఓర్పుగా నేర్పుగా మాట్లాడడమే "అనుద్వేగ కరము"! చూచిన దానిని, వినిన దానిని, అనుభవిoచిన దానిని, యధా తధముగా వివరించడమే.. "సత్యము"! ప్రేమ పూర్వకముగా మధురముగా, శాంతముగా పలకడమే.. "ప్రియము"! భూతదయతో, శ్రేయస్సుకోరి సంభాషించడమే.. "హితము"! అట్లే, వేద శాస్త్ర పఠనం, ఇష్టదైవ నామస్మరణము.. మున్నగునవి; వాక్కునకు సంబంధించిన తపస్సు!
👌ఉద్వేగము కలిగింపనిది, యధార్ధ మైనది, ప్రియoకర మైనది, హితమును గూర్చునది,యగు భాషణము! స్వాధ్యాయము, స్తోత్ర పారాయణము.. మున్నగునవి; వాచిక తపస్సు!
🚩"అనుద్వేగకరం వాక్యం!" అని, ( అధ్యాయం.17 శ్రద్ధాత్రయ విభాగ యోగం.. 15.వ. శ్లోక రత్నం నందు ) గీతాచార్యుని సందేశము!
  🙏గీతా సందేశము
       ( తేట గీతి)
      ప్రియము, హితములై యలరి, ఉద్వేగ మపన
       యించి, సత్య భాషణము భాషించుటయును,
         వేద శాస్త్రమ్ములను వల్లె వేయుటయును,
          వాఙ్మయ తపో విధమ్ములై పరగు లివ్వి!
      ( గీతా సప్తశతి., 'అష్టావధాని' శ్రీ చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి., )       

కామెంట్‌లు