బ్రతుకుబాట :- Rss పై ఆకర్షణ కోరాడ నరసింహా రావు... !

   ***   47   ***
నాకు జాగృతి పత్రికను పరి చ యం చేసినఅబ్బాయి...ముద్దు 
సాయిరాం... RSS. లోపార్వతీ పురానికి  క్రియాశీల కార్యకర్త !
RSS...ను గురించి గొప్పగా చెబుతూ... దేశభక్తి, సేవాభావంతో సమాజానికి సేవచేసే స్వయంసేవకుల సంస్థ ఇది ఓమారు వచ్చి చూడండి...
మీకునచ్చితేనే ఇందులో చేరం డి అంటూ నన్నుఒప్పించాడు!!
,వాళ్ళ ఉపన్యాసాలు విన్నతరు వాత, చేసే కార్యక్రమాలు, దిన చర్యతెలుసుకున్నతరువాత...
నాకూ అందులో చేరాలనిపిం చింది !ఖాకీ నిక్కర్, షర్టు, చేతిలో పొడవాటి కర్ర... రోజూ కార్యకతలంతా మైదానంలో కలవటం...సూర్యనమస్కారాలు, కర్రసాము, డ్రిల్,దేశభక్తి ప్రేరేపిత ఉపన్యాసాలు వినటం 
అదోరకమైనఆనందంఅనిపించేది... రోజూ ఉత్సాహంగా పాల్గొనే వాడ్ని ఆఉపన్యాసాలు
వింటుంటే అపారమైన దేశభక్తి 
అప్పట్లో పాలించి... మన దేవాలయాలను ధ్వంసం చేసి 
అధికారం చెలాయించిన తురుష్కులపై ద్వేషం కలిగేవి!
నేనూ కొన్ని శ్లోకాలు, పాటలు నేర్చుకుని... పాడేవాడిని !
ఆయా రోజుల్లోనే Rss.కి అతిముఖ్యుడైన హెగ్డేవార్ 
శతజయంతి ఉత్సవాలు జరిపించవలసిన సమయం... !
మేమంతా... రోజూ సాయంత్రం 
రోజుకొక వీధిలో శతజయంతి ఉత్సవాలు చేసేవాళ్ళం ! వీధి మధ్యలో హెగ్డే గారి ఫోటో  పెట్టి 
దండవేసి, దీపం వెలిగించి... 
శ్లోకాలు పాటలు.... నేనే ప్రధాన భూమిక పోషించేవాడిని !
అశ్వమ్ నైవ, గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ లాంటి కొన్ని శ్లోకాలు... జయము (1)జయము భారత మాత, జయము నీకు భరతమాత... 
(2) నవభాగీరధ కేశవునకు శతజయంతి నీరాజనం..... 
లాంటి పాటలు... దేశభక్తి ప్రపూరితమైన ఉపన్యాసాలతో 
అందరినీ ఆకట్టుకునే వాడ్ని !
ఉత్సవాలకోసo...చందాలు కూడా వసూలు చేసే వాళ్ళం !
ఇలా చాన్నాళ్ళే కొనసాగింది !రాను రాను... ఇందులో ప్రచారమే తప్ప సమాజ సేవ గానీ ఎట్టి ప్రజా ప్రయోజనం గానీ లేక పోగా... అందరిలోనూ ముస్లిం వ్యతిరేక భావాలను అందరిలో పురిగొల్పటమే గాని వాళ్ళుమాత్రం ముస్లింలతో స్నేహంగా వ్యవహరించటం నాకు నచ్చలేదు పౌర్ణమి వస్తే కోజాగరి అనే పెద్ద సంబరం చేసేవాళ్ళు వెన్నెల్లో పాలు మరిగించి... వ్యాయామాలు ఉపన్యాసాలు, ఆటలు, పాటలు అన్నీ అయిపోయిన తరువాత ఆపాలు త్రాగేవాళ్ళం
ఆ రోజు ఆపాలలో చంద్రుడు అమృతం కురిపిస్తాడని నమ్మేవాళ్లం... !
 మంచి సందడిగా సరదాగానే కార్యక్రమాలు జరిగేవి !
ఏది ఏమైనా... ఇంక నాకు అందులో కొనసాగడం ఇష్టం లేక విరమించేసుకున్నాను !!
       ******
  .........     సశేషం   .......
కామెంట్‌లు