సంబరాల సంక్రాంతి ;-టి.తరుణ్(s/o)బుచ్చన్న,8/b తరగతి,TTWURJC(B)KONDAPUR,(మం)ధన్వాడ,(జిల్లా)నారాయణపేట, తెలంగాణ.
 పల్లవి :- 
పచ్చని పొలాలు పండెనయ్య
 పసిపాపల నవ్వులు చూడరయ్య
 మకర సంక్రాంతి వచ్చింది
 మధుర క్షణాలను తెచ్చింది ॥2॥
చరణం 1:
 ధాన్య రాశులే ఇంటికొచ్చెనంట
 రైతు గుండెల్లో సంతోషమంట
 పిండివంటలతో ఇల్లంతా
ఘుమ ఘుమల సందడంట
                          "మకర"
చరణం 2 :
హరిదాసుల సందడి చూడండి
 ఆటపాటల జోరు హుషారండి
 బసవన్న రంకెలు తిలకించండి
 అలుపులేని కమ్మని గీతాలండి
                          "మకర"
చరణం 3:
ఇంటిముందు చక్కని రంగవల్లులు
గొబ్బెమ్మల అలంకారాలు
భోగి,సంక్రాంతి,కనుమల సందళ్ళు
                              " మకర"

కామెంట్‌లు