*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౨౦- 020)*
 *విద్వత్ పద్ధతి*
తేటగీతి:
*సత్యసూక్తి ఘటించు ధీ జడిమ మాన్చు*
*గౌరవ మొసంగు జనులకుఁగలుష మడఁచుఁ*
*గీర్తిఁబ్రకటించు చిత్తవిస్ఫూర్తిఁజేయు*
*సాధుసంగంబు సకాలార్ధసాధనంబు*
*తా:*
ఈ మానవ ప్రపంలో, మంచి వారితో స్నేహము బుద్ధి తక్కువను దూరం చేస్తుంది, అందరికీ గౌరవాన్ని ఇస్తుంది, మనుషులలో వున్న పాపాన్ని తగ్గిస్తుంది, కీర్తిని కలగ చేస్తుంది, మానసిక ఆనందం కలిగించి హాయిగా వుంచుతుంది. ఈ విధంగా మంచి వారి తో స్నేహం మానువులకు అన్ని విషయాలను సాధించే మార్గం అవుతుంది ...... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*విదురమహాశయుని సాంగత్యం వల్లనే కొంతకాలమైనా ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులు రాజ్యం భోగాన్ని అనుభవించ గలిగారు. భీష్ముడు, అశ్వత్థామ మొదలగువారి సాంగత్యం వల్లనే కురు సభకు ఆమాత్రం గౌరవం దక్కింది. కృష్ణునితో స్నేహం వల్లనే గోకులంలో గోపికలు ఉద్ధరించబడ్డారు, పాండవులు వారి కష్టాలు గట్టెక్కి, అశ్వమేధయాగం జయప్రదంగా నిర్వహించి, తమ సౌభాగ్యాలు అన్నీ తిరిగి పొందగలిగారు. కర్ణునితో, శకుని మామతో స్నేహం వల్ల దుర్యోధనాదులు సర్వస్వం పోగొట్టుకున్నారు. అందువల్ల, సత్సాంగత్యం కావాలి అందరికీ అని పెద్దల మాట. మంచివారి స్నేహం వలన చెడినవారు లేరని నానుడి. అటువంటి మంచి స్నేహాన్ని పంచగలిగన సద్గురువును మన అందరికీ ఇవ్వమని ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం అనుక్షణం ఆతృతతో ఆ పన్నగీశుని కోరుకుంటూ.....*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు