*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౩౦- 030)*
 *మానశౌర్య పద్ధతి*
తేటగీతి:
*అర్కకాంత మచేతనం బయ్యుసవితృ*
*పాదములుసోఁకినంతనె ప్రజ్వరిల్లుఁ*
*గాన నభిమానవంతుఁడైం దైన శత్రు*
*కృతతిరస్కారమెట్లు సహింపనేర్చు.*
*తా:*
సూర్యకాంతమణి స్వయంగా ప్రకాశించ లేదు. కానీ సూర్య భగవానుని కిరణములు పడగానే కావలసిన సంపదలు ఇస్తుంది.  మరి ఇది నిజమైనప్పుడు, అభిమానము ధనము వున్న వారు శత్రువుల తిరస్కారమును సహింప లేరు కదా....... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*సూర్యకిరణాలు సోకిన సూర్యకాంతమణి/ శమంతకమణి, స్వయంగా అచేతన అయి కూడా, చలించి, వలసిన సంపదలు ఇస్తున్నది అనేది జగమెరిగిన సత్యం.  ఆవు పాలు ఇస్తోంది. భూమి పంట ఇస్తోంది. చెట్టు గాలి ఇస్తోంది. కానీ సచేతనులమైన మనుషులం, మనం ఏమి చేస్తున్నాము. మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామా? మనతోటి వారి ఇబ్బందులకు స్పందించే ఆలోచన చేస్తున్నామా?  ఇంతెందుకు, మనం మనుషులము, పరమశివుడు మనకు ఆలోచించ గలిగిన మనసు ఇచ్చాడు అనే విషయాలు మనకు స్ఫురణలో వున్నాయా? సమాజంలో అత్యధికుల నుండి ఏమి సమాధానం వస్తుందో మనకు తెలుసు.  మనం చెయగలిగినది ఒక్కటే... "మాకు మనుషులుగా బ్రతికే సద్బుద్ధిని ప్రసాదించు పరమేశ్వరా" అని ప్రార్థన చేయడమే.... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు