అమ్మ ఒక దేవత;-నల్లా వైష్ణవి10వ.తరగతితెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా

 అమ్మ ప్రేమ మాధుర్యం
అమ్మ మనసు నిర్మలం.
మా ఇంటిలోన వెలసిన
చల్లని దేవత అమ్మ
అమ్మ అనే మాటలోన
అనురాగం దాగివుంది.
అమ్మ అనే పిలుపులోని
ఆప్యాయత నిండివుంది.
నవమాసాలు ననుమోసి
కనిపెంచి లాలించింది.
పురిటి నొప్పుల బాధను
ఓపికతో భరించును
అమ్మ లేనిదే సృష్టే లేదు
అమ్మను మించిన దైవం లేదు
డబ్బు వెనుక పడకురా
అమ్మ ప్రేమ మారువకురా
కామెంట్‌లు