నాన్న ప్రేమ; దామెర అనూష10వ.తరగతితెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా

 నా ప్రతి గెలుపు తన గెలుపు అనుకునేవాడు నాన్న.
నా జీవిత ప్రతి మలుపులో తోడుండే వాడు నాన్న.
నా ప్రతి కలను నిజం చేయాలనుకునే వాడు నాన్న.
నన్ను గుండెలపై ఆడించేవాడు,భుజాలపై ఎత్తుకునే వాడు నాన్న.
నా ప్రతి పుట్టిన రోజును పండుగలా,
ప్రతి క్షణాన్ని మంచి జ్ఞాపకంగా మలిచేవాడు నాన్న.
సముద్రమంత గంభీరమైనది నాన్న ప్రేమ.
కామెంట్‌లు