"రంగులహోళీపండుగ-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
రంగులుజల్లుచునాటలు
సింగారములొలుకుచుండచిన్నల్ పెద్దల్
పొంగారగనాడిమురిసి
రంగులలోకమ్మునందురాజిలుచుండెన్!!!

02.
కం.
రంగులలోనమునిగిరిట
హంగామాజేయుచుండిఆడిరిఆటల్
పొంగుచుపంచిరిప్రేమలు
సింగారమునొలుకజేయచిత్రంబాయెన్!!!

03.
కం.
జోరుగజేసిరిసవ్వడి
హోరుగబావామరదలుహోళీకేళిన్
బారులుదీసిరిజనులిల
పారెనురంగులుజలజలవరదలతీరున్!!!

04.
కం.

వచ్చెను"వసంత"కేళియె
తెచ్చెనుశోభలుపుడమికితేజమ్మొప్పన్
ముచ్చటగొల్పుచురంగులు
విచ్చియుజల్లిరివిధముగవిరిపూసొగసుల్!!!

05.
కం.
ఆహా!హోళీ!పండుగ!
ఓహోఓహోయనుచునుఉర్విజనులిలన్
ఏహే!ఏహే!మదిలో
సాహోవర్ణాలుజల్లిసంబరపడిరోయ్!!!
కామెంట్‌లు