"ప్రపంచజలదినోత్సవం- జలకందాలు"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
రోగాలనివారణలో
బాగుగపనిజేయుచుండిప్రాణమునిల్పున్
వేగౌషధియైనిత్యము
శ్రీగంగాజలముమనకుశ్రేయస్సునిడున్!!!

02.
కం.
నీరేప్రాణాధారము
నీరేయారోగ్యసిద్ధినిజమిదిగనుమా
నీరేవిశ్వద్ద్రావణి
నీరేభూమండలముననిధివలెనుండెన్!!!

03.
కం.
పంటలుపండుటకొరకును
వంటలువండుటకొరకును;పాత్రలపైనన్
ఇంటిని,యొంటినిమరియా
రెంటినిశుభ్రమ్ముజేయరేసలిలముతోన్!!!

04.
కం.
జలకళతోనడయాడియు
గలగలగోదారిమొదలుకదులుచుపారున్
మిలమిలమిరిమిట్లుగొలిపి
జలవిద్యుచ్ఛక్తినొసగిసంపదనింపెన్!!!

05.
కం.
నీటినిపొదుపుగవాడుము
నీటినినిల్వంగజేసినియమముతోడన్
నాటికియేనాటికయిన
నీటికొరతనడ్డువేసినిలువుమునరుడా!!!


కామెంట్‌లు