పంచదార చిలకలు;-ఎస్‌. హనుమంతరావు--8897815656

 పంచదార చిలకలు
రంగు రెక్కలున్నా
ఎగరనైతే ఎగరవు
పలుకులేమీ పలకవు
అయితేనేం... నోరూరిస్తాయి
తీపి తీపి చేస్తాయి
పెరట్లో చెట్టు నిండా
రామ చిలుకలు
అక్క సారె కావిడి నిండా పంచదార చిలకలు
కొమ్మ మీది రామచిలకలు ఊగుతూ
కావిడిలో పంచదార చిలకలు తూగుతూ
చిలకలు పంచదార చిలకలు
జాంపళ్లంటె ఆ చిలకలకు ఇష్టం
ఈ చిలకలంటె నా కిష్టం
అన్నీ సారెకేనా?
అమ్మ కొన్ని దాచే వుంటుంది నా కోసం
అమ్మ ప్రేమ మధురం కదా
పంచదార చిలకల కంటె
ప్రపంచంలో మరి దేని కంటె!

కామెంట్‌లు