మంచిచేసిచూడు-పాత్లావత్ పురందాస్ 9వ తరగతిZPHS నేరళ్లపల్లిమహబూబ్నగర్7013264464

ఒక ఊరిలో విక్రమ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను ఎప్పుడూ జంతువులను హింసించేవాడు. పెద్దలను గౌరవించేవాడు కాదు. తన మెదడులో చెడు అలవాటు అనే విత్తనం నాటుకుపోయింది. గురువులు చెప్పే మంచి మాటలను మెదడులో ఎక్కించుకునేవాడు కాదు. విక్రమ్ ఎప్పుడూ అల్లరిచేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు ఎంత బుద్ధి చెప్పినా వినిపించుకునేవాడు కాదు. వాడి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు విక్రమ్ ను పిలిచి" ఈపాఠశాల ప్రధానోపా ధ్యాయుడిగా నేను నీకు ఒకమాట చెబుతాను వింటావా" అన్నాడు. "వింటానుమాష్టారూ"అన్నాడు విక్రమ్. "రేపటి ఆదివారంరోజు మాత్రం ఇతరులకు ఉపయోగపడే కొన్ని మంచిపనులు చేయి" అని చెప్పారు. 
    విక్రమ్ "సరేమాష్టారూ!" అన్నాడు. మరుసటి రోజు ఒక కుక్క తన కాలి మీద గాయమయ్యి బాధపడుతూ కనిపించింది. ఆ కుక్కను చూసిన విక్రమ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి కట్టు కట్టాడు. విక్రమ్ కు ఎంతో సంతోషం అనిపించింది.
 తర్వాత ఊరిలో తిరిగి వద్దామని బయలుదేరాడు. ఒక చోట ఒక ముసలావిడ దాహంతో ఏడుస్తోంది. ఆమెకు నడవడానికి కూడా చేతనవ్వటంలేదు. విక్రమ్  ఒక చెంబులో నీళ్ళను తెచ్చి ఆమెకు ఇచ్చాడు. ఆ ముసలావిడ  నీళ్లను తాగి  "బాబూ దాహంతో విలవిలలాడుతున్న నన్ను నీళ్ళు ఇచ్చి కాపాడావు. నా ఆయుషు కూడా పోసుకొని నిండు నూరేళ్లు బతుకు" అని దీవించింది. విక్రమ్ ఆమె వివరాలు తెలుసుకుని మిత్రులతో కలిసి ఆమె ఇంటి వద్ద చేర్చాడు. విక్రమ్కు ఎంతో సంతోషమనిపించింది. ఇతరులకు సహాయపడటం వంటి మంచి పనులు చేయడంవల్ల మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుందని అర్థమయింది.అలా విక్రమ్ తనప్రవర్తన మార్చుకున్నాడు. మంచి పనులు చేయడం మొదలు పెట్టాడు.  మారినవిక్రమ్ నుచూసి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఎంతో సంతోషించారు.
కామెంట్‌లు