సమస్యాపూరణలు;-మమత ఐలకరీంనగర్9247593432
 *నీలి మేఘమలరె నింగి యందు*
ఆ.వె
కరువుబాధలోని కన్నీరు చుక్కలు
చెరువువలనె పారి చేర బోయె
నీరు యావిరిగని నేలనందెదనని
*నీలి మేఘమలరె నింగి యందు*

 సమస్యాపూరణం
*కుటిలాలక యెడమకన్ను కుడికన్నాయెన్*
క.
పటపట వండెడి వంటన
చిటపటమని కూరపోపు  చిల్లగ కంటన్
తృటిలో రెప్పను వాల్చగ
*కుటిలాలక యెడమ కన్ను కుడికన్నాయెన్*

కామెంట్‌లు