చిత్రానికి పద్యం (హోలీ సందర్భంగా);-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
మన్మథుడు బాణమేయగన్ మంజునాథ
రౌద్ర రూపాన్ని దాల్చుచు రయము తోడ
భస్మమును జేసె తపముకు భంగమొనర
దేవతలు గాంచు చుండగన్ తిరుగులేని
కన్ను దెరిచెను ముక్కంటి ఘనము తోడ
తే.గీ
కామ దహనాన్ని జేసేటి కారణముతొ
కాల్తురీనాడు పిడకలు కర్రలేసి
చెడుకు నిప్పునంటించుచు చెలిమితోడ
హోలి పర్వాన్ని జరిపేరు మూలమూల


కామెంట్‌లు