ముగ్గురు స్నేహితులు;-..కనుమ ఎల్లారెడ్డి--93915 23027.

 కరోన వలన ఎంతో మంది  పేద ప్రజలకు  ఏదయినా చేయాలి అనిపించింది విక్రమ్,మదన్,సంపత్ లకు ఏమి తొచ లేదు.కరోన తో బైట తిరగవద్దని చెబుతుంటే ఇంటి పట్టునే ఉండిపోయారు.ఎంత సేపు టీవీ  చూసుకుంటూ ఉంటాం.చాలా బోర్ గా ఉందని,ఏదయినా మంచి పని చేయాలని ఒకరికొకరు ఫోన్లు చేసుకుని మదన్ ఇంటి డాబాపై కలుసుకున్నారు. వారిలో మదన్ అంటున్నాడు " ఈ కరోన సమయంలో పేదలు పని దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం వారి దగ్గరకు వెళ్ళి మాస్కులు, నిత్యావసర సరుకులు పంచుదాం "అన్నాడు."దానికి డబ్బు కావాలిరా " అన్నాడు విక్రమ్."నా దగ్గర హుండీలో కొంత డబ్బు ఉంది", అనగానే " మా హుండీలో కూడా డబ్బు ఉంది అన్నారు ఇద్దరు. "ఇంకేం ఆ డబ్బులు తో రేపు మనం పేదలకు సహాయం చేద్దాం అనుకున్నారు.మరుసటిరోజు ముగ్గురూ ఒక్కో ఇంటికి వెళ్ళి నిత్యవసరాలు,మాస్కులు, సానిటైజ్ లు పంపిణీ చేశారు.ఇది వారి పాఠశాల హెడ్మాస్టర్ కు తెలిసి ఎంతో సంతోషించాడు. వారి సేవను చూసి ముగ్దు డైనాడు. వారి పేర్లు కలెక్టర్ కు తెలియజేశాడు.మరుసటి రోజు కూడా నిత్యావసర వస్తువులు పంచుతుండగా కలెక్టర్ వారి సేవా నిరతిని కొనియడాడు. 
"గుడ్ మీరు ఈ కరోన సమయంలో ఒక్కటై ,చిన్న వయసులోనే సేవా దృక్పథంతో చాల మంచి పనులు చేస్తున్నారు, ఎందరికో మీరు స్ఫూర్తి ఇస్తున్నారు.మీ ముగ్గురిని అభినందిస్తున్నాను."అన్నాడు కలెక్టర్. కలెక్టర్ అభినందనలు తమ పిల్లలు అందుకున్నం దుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. " మీ స్నేహం ఎప్పుడు ఇలాగే
ఉండాలి " అని కోరుకున్నారు.

కామెంట్‌లు