పక్షుల సందడి;- --కయ్యూరు బాలసుబ్రమణ్యం 9441791239 
చిలకల్లారా ..‌చిలకల్లారా
కమ్మని కబుర్లు చెప్పండి

నెమళ్లుల్లారా..నెమళ్లుల్లారా
చక్కని నాట్యాలు వేయండి

కోయిల్లారా..కోయిల్లారా
తీయని పాటలు పాడండి

హంసల్లారా..హంసల్లారా
ముచ్చట నడకలు నేర్పండి

కోళ్లుల్లారా..కోళ్లుల్లారా
ప్రొద్దునే నిద్రను లేపండి

అందరు కలిసి హాయిగా
సందడి,సందడి చేయండి


 

కామెంట్‌లు