జంతువుల ముచ్చట;---లతా శ్రీ9666779103

 ఒక అడవిలో అన్ని జంతువులు కలిసి పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాయి. అంతలో చిలుకమ్మ అక్కడికి వచ్చి చెట్టు పై వాలింది హాయ్ మిత్రులారా! ఏమిటి ?అందరూ ఒకచోట చేరారు ! మహా మహా కవులు అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా కవిత దినోత్సవాలు! మీరు కూడా జరుపుకుంటున్నారా ఏంది? అంది ముసిముసిగా నవ్వుకుంటూ.. చాలమ్మా చాలు వెటకారాలు అంది కుందేలు. నీవంటే ఆ జనాల మధ్య భవనాల మధ్య తిరుగుతూ బాగా మాటలు నేర్చావు ఈ అడవిలో చెట్లను నరికి వేయడం వల్ల ఆహారం కొరత ఏర్పడి ఆకలితో నకనక లాడుతున్నాం అందరం.ఇంకేం కవితాసమ్మేళనాలు..మిత్రుడు పావురం ఆహారం ఆచూకీ తెలిపిన పుడు అవి మా పాలిట స్వాంతన జల్లులు కావడంతో కాస్త ఊరట చెంది సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ కూర్చున్నాం. పిల్లల మోమున విరిసిన చల్లని చిరు నవ్వులు తనివితీరా చూసుకుంటున్నాం. ఆహారాన్ని త్వరగా సేకరించి అందరికీ పంచాలన్న ఏనుగన్న ఆలోచనతో ఏకీభవించి ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నాం.
ఓహో అదా సంగతి మంచి ఆలోచనే ఈ మాత్రం ఆలోచనలు జ్ఞాని అనిపించుకుంటున్న మనిషికి లేక పోతున్నది రోజురోజుకు సంపాదించినది మొత్తం కాంక్రీట్ భవనాలు నిర్మించడం లో డాబు ,దర్పంచూపించడం లో ఉత్సాహం చూపుతున్నాడు. అహంకారం ,దొంగతనాలు, భూకబ్జాలు, అసాంఘిక చర్యలు మానవజీవితానికి కాలుష్య మేఘాలు అని తెలుసుకోలేక తానే గొప్ప వాడని విర్ర వీగుతున్నాడు.బంధాలు బంధుత్వాలు దూరం చేసుకుని నిర్మించుకున్న భవనాల్లో తనకు తానుగా బందీ అవుతున్నాడు. పచ్చని చెట్ల నడుమ బంధుత్వాల అల్లికలతో ,మమతాను రాగాల పరిమళాలతో ఆహ్లాదకరంగా జీవనం సాధించాల్సింది పోయి ఆధునికీకరణ మత్తులో జోగుతున్న మనిషిని చూస్తే చాలా బాధ వేస్తోంది.అంది దిగులుగా.
జంతువులన్నీ మూకుమ్మడిగా ..అయ్యో!చిలకమ్మా బాధపడకు మనం ఏమి చేయగలం మనిషి తనకు తానుగా అర్థం చేసుకోవాలి జంతువులు చెట్లు పక్షులు అన్ని ప్రకృతిలో ఉన్నప్పుడే మనిషి జీవనం కూడా సంతోషకరంగా సాగుతుందని అర్థం చేసుకున్నప్పుడే మనిషికి సౌఖ్యం. 
 అంతలో భోజనాలు రావడంతో అన్ని బిలబిల మంటూ అటు పరుగెట్టాయి..
నీతి:కలిసి ఉంటేనే కలదు సుఖం
సి.హేమలత

కామెంట్‌లు