సమానత ఖేళీ..ఆనందాల హోలీ..;---ఇమ్మడి రాంబాబు -తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తెలంగాణ చలాన భాషిని:9866660531
 సమానత ఖేలీ ..ఆనందాల హోలీ
రంగుల ఖేళీ... కేరింతల హోలీ
సప్త వర్ణాల ....సమ్మెళనం
హోళీ ఖేళి మానవాళి జీవితాన...
తరతమ భేదాలు మరిపింప చేస్తూ
ఐక్యతా రాగాలందిస్తూంది హోళీ ఖేళి.
జాతి మత బేధాలు వీడి సరస రాగాలతో
చమ్మకేళిల హోలీ పదనిసలతో..
వదిన మరదలు బావ బామ్మర్దులు
వావివరుసలు కలిసిన వాళ్లంతా 
ప్రేమానురాగంతో ముఖారవిందాలను 
తీరొక్క రంగులతో ముఖవర్చస్సులను 
పంచవన్నెల చిలుకల పలుకులతో
ఆహా భావాలను ఆలరింప చేస్తారు.
అష్ట కష్టాలను భాదలను మైమరచి 
రతీమన్మదుల వోలె  సంతోషాల పరవశంతో
హోలీ క్రీడల జలకాలాటలలో హాస్యపు
పూజల్లులతో ఆనంద పరవళ్ళు  తొక్కుతారు.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుంది హోలీ ఖేలి.కామెంట్‌లు