వెంటాడే పద్యం;-మీసాల సుధాకర్.పి.జి.టి-తెలుగుతెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట,జనగామ జిల్లాచరవాణి:-9908628430
అడవి పక్షుల కెవ్వ డాహార మిచ్చెను 
మృగజాతి కెవ్వడు మేత బెట్టె

జలచరాదులకు భోజన మెవ్వడిప్పించె 
చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసె

స్త్రీల గర్భంబులన్ శిశుల నెవ్వడు పెంచె
 ఫణుల కెవ్వడు పోసె బరగ పాలు

మధుపాళి కెవ్వండు మకరంద మొనరించె 
బసుల కెవ్వడొనరించె బచ్చి పూరి

జీవకోట్లను బోషింప నీవె కాని 
వేఱె యొక దాత లేడయ్యె వెదికి చూడ
భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస 
దుష్ట సంహార నరసింహ దురిత దూర

కామెంట్‌లు