శివుడే లింగ రూపుడు "శంకర ప్రియ.," శీల., సంచార వాణి: 99127 67098
 👌శివుడు లింగ రూపుడు!
     లింగ రూపుడు శివుడు!
     సర్వ మంగళ కరుడు!
              ఓ తెలుగు బాల!
        ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌"శివుడు".. సత్, చిత్, ఆనంద మయుడు! పరంబ్రహ్మ స్వరూపుడు! నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వరూపుడు!
        "లింగము".. సాంబశివ పరమాత్మకు సంకేతము! సాకార, నిరాకార స్వరూపము!
👌పరమశివుని యొక్క దివ్యలీలా మూర్తులలో ఒకటి.. ఆద్యంతములు లేని "దివ్య జ్యోతి ర్లింగ మూర్తి"! మహా లింగోద్భవుడు.. పరమశివుడు!
       సాధకులకు, మరియు, ఆరాధకులకు సమస్త శుభములు, మంగళములు, విజయములు.. కలిగించు; పరమేశ్వరుడు.. "శివ లింగ" మూర్తి గా ఆవిర్భవించాడు. కనుక, శివుడే.. లింగ రూపుడు! లింగ రూపుడే.. శివుడు!
⚜️ శివలింగ దండకము⚜️
          జయ జయ శివ లింగ! జ్యోతి ర్మహాలింగ! లింగోద్భవ! శ్రీ మహాలింగ! వేదత్రయీ లింగ! నిర్లింగ! సంస్పర్శ లింగ! క్షమా లింగ! సద్భావ లింగ! స్వభావైక లింగ! దిగ్దేశ కాల వ్యవఛ్చేద రాహిత్య లింగ! స్వయంభూ మహాలింగ! స్వామీ! నమస్తే! నమస్తే! నమః !!
         (శ్రీ శివలింగ గద్యము., ఈశ్వరార్చనా కళా శీలుడు, శ్రీనాథ మహాకవి., )

కామెంట్‌లు