లోక పితృ పాదులు "శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 👌శివా! తండ్రివి నీవె!
     మాకు తల్లివి నీవె!
      మీ బిడ్డలము మేము!
            
               శ్రీసాంబ! సదాశివ!
             ( శ్రీసాంబశివ పదాలు., శంకర ప్రియ.,)
👌శ్రీ శివ పార్వతులు.. సమస్త ఐశ్వర్యమునకు మూల కారకులు! కనుక, "శ్రీమంతులు". సకల జీవరాశికి ఆది దంపతులు! అందు వలన, "ఈ చరాచర ప్రపంచము నకు.. జననీ జనకులు"!
👌తమ కడుపును పుట్టిన, కన్న బిడ్డల యొక్క పెంపకం, చదువు, సంస్కారము లను; జన్మ నొసగిన, కన్న తల్లిదండ్రులు.. పరిశీలిoచు చున్నారు! అట్లే, సకల ప్రాణి కోటికి...  ఆలన పాలన, మరియు "యోగ క్షేమములను" పురాణ దంపతులైన, శ్రీ శివా శివులు.. సమకూర్చు చున్నారు!
    🔱దైవ ప్రార్ధన 
          ( కంద పద్యము)
    శ్రీమాతా మాహేశ్వర!
    శ్రీమచ్చివ! మీరు లోక పితృపాదులు! మా
    క్షేమమ్ము గూ

ర్చు చుండుము!
    వేమఱు ప్రార్ధింతు మెల్లవేళలను శివా!!
        ( శ్రీమాన్ శివ = శ్రీమచ్చివ )
( రచన: "ఆర్షకవి శిరోమణి" విద్వాన్ బులుసు వేంకటేశ్వరులు., శ్రీ శివ శతకము., )
కామెంట్‌లు