నవ్య కవితా పితామహుడు-రాయప్రోలు;-కవిమిత్ర, సాహిత్యరత్న అయ్యలసోమయాజుల ప్రసాద్రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతివిశాఖపట్నం9963265762
ఏ దేశమేగినా ఎందుకాలిడినా, 
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము 
అని తెలుగునాటే గాక
యావత్ భారతావని కే
స్వాతంత్ర్య సంగ్రామంలో
ప్రేరణ నిచ్చిన జాతీయత మూర్తీభవించిన కవితాగ్రేసరా అందుకో
మా శతకోటి వందనములు....!!

జీవితాంతం స్నేహితులుగా మిగలిపోయిన ప్రేమికుల
అమలిన శృంగారతత్వాన్ని
"తృణకంకణం" అనే ఖండకావ్యం లో వందేళ్ళ క్రితమే అంకురార్పణ చేసిన
స్వేచ్ఛావాద కవి మీకివే శతకోటి వందనములు....!!

సౌందర్యలహరి, మధుకలశం, భజగోవిందం వంటి అనువాదరచనలే గాక  ఆంధ్రావళి, వనమాల,తెలుగుతోట ,తృణకంణము వంటి
ఎన్నో ఎన్నెన్నో ఖండకావ్యాలలో 
ఆనాటి సామాజికస్థితులను జోడించి సాహిత్యం సమాజానికి దర్పణమని నిరూపించిన ,నవ్య కవితా పితామహా మీ కివే శతకోటి వందనములు.....!!


కామెంట్‌లు