సిద్ధాంతమే ఊపిరిగా స్వరాజ్యం;-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్విశాఖపట్నం9963265762
 ( 1931 -2022)
.................................
నమ్మిన సిద్ధాంతాన్ని
మనసా, వాచా, కర్మణా   జీవితాంతం ఆచరించిన
మహిళా శిరోమణి మల్లు స్వరాజ్యం.
పడమూడేండ్ల ప్రాయంలోనే
తెలంగాణ సాయుధ పోరాటంలో చేరి మొదట తుపాకి చేత పట్టిన మహిళ
భూస్వామ్య కుటుంబంలో జన్మించినా భూస్వామ్యవాదులకు వ్యతిరేకంగా పనిచేసి
స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని కమ్యూనిస్టు భావజాలంతో ప్రేరణచెంది
నైజాం కు వ్యతిరేకంగా పోరాడి రజాకారుల పాలిట
సింహ స్వప్నమై పోరాడిన విప్లవ వనిత.
ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగ రెండు పర్యాయాలు ఎం.ఎల్.గా
ఒక పరి ఎం.పి గా ప్రజాలద్వారా ఎన్నికై
ప్రజాభిమానాన్ని పొందిన
ప్రజల మనిషి స్వరాజ్యమ్మ
సహచరుడైన మల్లు నరసింహారెడ్డి ని పరిణయమాడి వివాహం అడ్డుకాదని తన తుంగతుర్తి ప్రజలకు అమ్మగా హృదయంలో నిలచి పూర్ణాయుర్దాయంతో
తొమ్మిది పదులు జీవించి
మార్క్సిస్టు పార్టీ స్వర్ణోత్సవాలలో రెండేళ్ళ క్రిందట తమ పార్టీ సిద్ధాంతంలను ప్రజలకు తెలియచేసి సిద్దాంతమే ఊపిరిగా జీవించి తిరిగిరాని లోకాలకు మమ్ము వదలి వెళ్ళిన
మల్లు స్వరాజ్యం మీరు నేటి తరానికి ఆదర్శనీయులు. సదా స్మరణీయులు అందుకోండి
మీకివే నా అక్షర నివాళి...!!
.............................

..............................

కామెంట్‌లు