ఆటవెలది పద్యాలు;-కే .లహరి -9 వ తరగతి ,ఈ/యం-జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి,కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.
1.
చిన్న మొక్క నాటి చెంబెడైనను నీరు
పోయవలెను రోజు ప్రొద్దునందు
చిగురు పెట్టి యవియు చెట్లుగ  యెదుగును
లహరి మాట వినుము రమ్యముగను .

2.

చదువు పైన ధ్యాస చక్కగా పెట్టిన
రాణి దంటు లేదు రాజ్యమందు
బద్ధకంబు వీడి శ్రద్ధతో చదువుము
లహరి మాట వినుము రమ్యముగను .


కామెంట్‌లు