(1)
రసహృదయాలు
పరవశిస్తున్నై,
కవిత పరిమళాన్ని
వెదజల్లింది !
*****
(2)
స్వాతంత్య్రం కోసం
సాగినపోరాటాల్లో
జనజాగృతి !
గేయకవితమహిమ!!
*******
(3)
చక్రవర్తులచేతే
కనకాభిషేకాలు
గండపెండేరాలు
కవిత్వంగొప్పే !
*******
(4)
కలము, ఖడ్గము
హలము, కలము
సు కవిత్వమే
జీవిత ఉత్ప్రేరకం !
*******
(5)
ఆత్మానందదాయకం
ఉభయతారకం
ఉల్లాసభరితం
సాహితీ సేద్యం !
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి