మూలధనం!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆతల్లికి ముగ్గురు కొడుకులు. కొద్దిగా పొలంఉంది కానీ పంట అంతగాపండని సారంతక్కువ భూమి. ఓరోజు ఆమె కి ఓఆలోచనవచ్చింది."నేను హఠాత్తుగా చస్తే నాకొడుకులు ఈఇల్లు ఆకాస్తపొలం ఎలాపంచుకోవాలో తెలీక కొట్లాడుకుంటారేమో?ఇప్పటి నించి వారి కాళ్ళపై వారు నిలబడేలా  చేయాలి. "అందుకే తలా వంద వెండి నాణాలు  తనుదాచినవి ఇచ్చి "ఏమర్రా!మనపొలం సరిగ్గా పండదు.ఏదైనా వ్యాపారం చేసి మీకాళ్లపై మీరు నిలబడి డబ్బు పోగేసి రండి "అంది."అమ్మా!నీకు ఆరోగ్యం అంతబాగుండటంలేదు కదా?"మొదటి ఇద్దరు కొడుకులు అన్నారు. "అరే!అమ్మ కోసం మనం ఇక్కడే ఉండిపోతే మన భవిష్యత్తు ఏంటీ?"సాగదీశాడు ఆఖరాడు.
 సరే ముగ్గురు తల్లి మంచి చెడులు చూస్తూ ఉండమని ఇరుగుపొరుగు కి అప్పజెప్పిఅమ్మ ఇచ్చిన డబ్బుతో బైలుదేరారు.పెద్ద వాడుఇలా ఆనుకున్నాడు" ప్ర తిరోజూ అందరికీ కావల్సిన వస్తువు ఉప్పు.వ్యాపారంలో నష్టం రాదు"అనుకుని ఉప్పుని స్వయంగా అన్నిపల్లెలకు తిరిగి అమ్మేవాడు.కొన్నాళ్లుగడిచేప్పటికి బాగా డబ్బు చేతికి వచ్చింది. చిన్నగా ఒక పట్టణంలో చిన్న సరుకులషాపు తెరిచి ఓఇల్లు కూడా కొన్నాడు.రెండోవాడుఇలా ఆలోచించాడు "అమ్మ ఇచ్చిన  వెండినాణాలు ఆమె కి తిరిగి ఇచ్చేయాలి. నేను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించే మార్గం చూసుకుంటా"అనుకుని మగ్గంనేసేవారి దగ్గర కూలీగా చేరి వారి ఇంట్లో పనీపాటా చేసి ఊరూరా బట్టల అమ్మకం చేసేవాడు. పిల్లాడు బుద్ధిమంతుడని గ్రహించిన మగ్గంనేసేవాడు తన ఒక్కగానొక్క కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలి అనే ఆలోచనతో శివా కి బాగా చేయూత నందించాడు. మూడోవాడు ఇలా అనుకున్నాడు "అమ్మ మాకు తెలీకుండా  బాగా డబ్బు దాచుకుని మామొహాన వందనాణాలు పారేసింది.ఇంకా ఎంతో ఉండేఉంటుంది.నేనెందుకు కష్టపడాలి?"అనుకుని జల్సా గా పనీపాటా లేకుండా తిరిగాడు.ఏడాది గడువుముగియగానే ముగ్గురు తమ ఊరుచేరారు.తల్లి మాటాపలుకులేకుండా మంచానికి బల్లిలా అతుక్కుపోయి ఉంది. వీరిని చూసిన ఆనందం తో ఆమె ప్రాణం పోయింది. ఊరివారి సాయంతో తల్లికి  అంతిమ సంస్కారం చేశారు. ఆఇల్లు అమ్మేసి ఖర్చులుపోను అంతా సమంగా పంచుకున్నారు. పెద్దవాడు రెండోవాడూ కలిసి  వ్యాపారం చేస్తూ ఏడాదికల్లా పెళ్లిచేసుకుని స్థిరపడ్డారు.మూడోవాడు  కూలీగా మిగిలి పోయాడు.అందుకే తాహతుకిమించి ఖర్చు  జల్సాచేస్తే  భవిష్యత్తు పాడవుతుందిసుమా!🌹
కామెంట్‌లు