చిత్రకేతుడు.పురాణ బేతాళ కథ. .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలు దేరాడు.అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే,నాకు చిత్రకేతుని గురించి తెలియజేయి.తెలిసి చెప్పక పోయావో మరణిస్తావు' అన్నాడు.
'బేతాళా ఇతను వసుదేవుని తమ్ముడైన దేవభాగుని పెద్దకొడుకు. ఇతను శూరసేనదేశానికి రాజు. చిత్రకేతుడు చాలా మంది భార్యలనువివాహమాడాడు.అంతమందిభార్యలను వివామాడిననూ ఎవరికీ సంతానం కలుగలేదు.దానితో చిత్రకేతుడు మనస్సులో దిగులు వెంటాడుతుండేది. ఒకరోజుఅంగీరసుడను గొప్ప సాధువు అతని రాజభవనానికి వచ్చాడు.చిత్రకేతుడుపాదాలనుకడిగిస్వాగతించాడు.సంతానం కారణంగా సంతోషంగా లేడని తెలుసుకుంటాడు. అంగీరసుడురాజుచిత్రకేతుడుతో పుత్రకామేష్టి యాగం చేయించి,యజ్ఞప్రసాదంఅతనిపట్టపురాణికృతద్యుతిచేతతినిపిస్తాడు.దీని ఫలితంగా భార్య కృతద్యుతి ఒకకొడుకుకుజన్మనిచ్చింది. రాజుకు కొడుకు పుట్టిన తరువాత రాజు,రాజ భవనంలోని నివాసితులందరూ చాలా ఆనందంగా ఉంటారు.దీనితో కృతద్యుతి సహభార్యలకు అసూయ కలిగింది.తరువాత కొంతకాలానికి అసూయ చెందిన రాజు భార్యలు రాజు కుమారునికివిషప్రయోగంచేస్తారు.లేకలేకకలిగిన కుమారుడు మరణంతో చిత్రకేతుడు కలతచెందుతాడు
చిత్రకేతుడు అధిక విలాపం నుండి ఉపశమనం పొందటానికి అంగీరస మహాముని, నారద మహర్షి ఒకరోజు జీవితం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి,తండ్రి, కొడుకు మధ్య సంబంధం వాస్తవం కాదని,ఇది కేవలం భ్రమ మాత్రమేనని,ఈ సంబంధం ఇంతకుముందు ఎప్పడూ ఉనికిలో లేదని,భవిష్యత్తులో కూడా ఉండదని, తాత్కాలిక సంబంధాల కోసం ఒకరు కోసం ఒకరు విలపించకూడదని, మొత్తం విశ్వ వ్యక్తీకరణ తాత్కాలికంఅని, అవాస్తవం కానప్పటికీ, ఇది వాస్తవం కాదని. భగవంతుని వ్యక్తిత్వం దిశ ద్వారా, భౌతిక ప్రపంచంలో సృష్టించబడిన ప్రతిదీ అశాశ్వతమైందని,ఒక తాత్కాలిక అమరిక ద్వారా, ఒక తండ్రికి ఒక బిడ్డ పుడతాడు, లేదా ఒక జీవన సంస్థ అని పిలవబడే తండ్రికి బిడ్డ అవుతాడని,ఈ తాత్కాలిక ఏర్పాటు దైవం చేత చేయబడిందని,తండ్రి లేదా కొడుకు ఎవ్వరూ స్వతంత్రంగా లేరని, ఈ వాస్తవాలు తెలుసుకుని చింతను విడనాడాలని బోధిస్తారు.అంగీరసుడు, నారద ఉద్బోధ ద్వారా చిత్రకేతుడు విచారం నుండి విముక్తి పొంది జ్ఞానవంతుడై దేహం వదలి దేవత్వం వహించి విద్యాధరాధిపతి అయి ఒకప్పుడు కైలాసానికి పోయి అచ్చట పార్వతితో కూడుకొని ఉన్న శివునిచూచి, జగత్కర్తలు అయిన మీరు కూడ ఇట్లు మిథునరూపంగా ఉందురా, అని పార్వతీదేవి వినునట్లు అంటాడు.అందులకు పార్వతి కోపించి అతనిని రాక్షసుడు అగునట్లు శపిస్తుంది.అంత అతడు వృత్రాసురుడుగా జన్మించి, ఇంద్రుని చేత చంపబడి మోక్షాన్ని పొందుతాడు' అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగంకావడంతో శవంతోసహా మాయమైన బేతాళుడు మరలా చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు