ప్రకృతే దైవం.;-డా. బెల్లంకొండ నాగేశ్వరరావు ., చెన్నై
 దోరమాగిన చింతకాయకు ఉప్పు అద్దుకు తింటున్నాడు కోతి.
' అయ్యో చింతకాయ తింటున్నావు జలుబు చేయదా?పళ్ళు పులిసిపోవా?' అన్నది పిల్లరామచిలుక.
 ' పులుపు సి విటమిన్ జలుబురాకుండా చేస్తుంది. పళ్ళు పులిస్తె వేడినీళ్ళు పుక్కిలిపడితే సరిపోతుంది.
విటమిన్ సి నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా బంగాళాదుంప, టమాటో మొదలైన వాటిలో ఎక్కువగా లభించే విటమిన్. ఇది సప్లిమెంట్ల రూపంలో కూడా లభ్యమవుతుంది. ఇది స్కర్వి వ్యాధిని నివారించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది.విటమిన్ సి మృదులాస్థి, ఎముక, డెంటీన్ ల మాత్రికను, రక్తనాళాల ఎండోథీలియమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రక్తంలో కొలెస్టరాల్ ను కరిగిస్తుంది. గాయాలు త్వరగా మానడానికి, ఇనుము శోషణాన్ని అధికం చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది. విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంపొందించి, జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తపోటును తగ్గిచటం, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచటంలో విటమిన్ సి పాత్ర ఎక్కువ కాబట్టి.. దీని మోతాదులు తగ్గటమనేది మెదడులో రక్తనాళాలు చిట్లటానికి దోహదం చేస్తుండొచ్చని వివరిస్తున్నారు. అయితే మాత్రలను వేసుకోవటం కన్నా ఆహారం ద్వారానే విటమిన్ సి లభించేలా చూసుకోవటం మేలని సూచిస్తున్నారు. నారింజ, బత్తాయి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, క్యాప్సికం, మిరపకాయలు, గోబీపువ్వు, ఆకుకూరల వంటి పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది. దీని ప్రధాన లక్షణం చిగుళ్ల నుంచి రక్తస్రావం కావటం. అందువల్ల విటమిన్ సి లోపంతో మెదడులో రక్తస్రావమయ్యే అవకాశమూ ఉండొచ్చని క్లీవ్‌లాండ్ క్లినిక్‌కు చెందిన డాక్టర్ కెన్ యుచినో అభిప్రాయపడుతున్నారు. విటమిన్ సి లోపమనేది ఒకరకంగా అనారోగ్యకర జీవనశైలికి నిదర్శనమని, ఇది పక్షవాతం ముప్పును పెంచుతుందనీ గుర్తుచేస్తున్నారు. మద్యపానం, అధిక బరువు, అధిక రక్తపోటు వంటివన్నీ పక్షవాతం ముప్పును పెంచుతాయి. మన జీవనశైలిని మార్చుకోవటం ద్వారా వీటిని దూరంగా ఉంచుకోవచ్చు. అందువల్ల ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమని ఈ అధ్యయనం మరోసారి నొక్కిచెప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి విటమిన్ సి మెదడు ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. ఆలోచనలు, భావనలు, ఆదేశాల వంటి వాటిని మన మెదడులోని వివిధ భాగాలకు చేరవేసే న్యూరోట్రాన్స్‌మిటర్ల తయారీకి.. ముఖ్యంగా సెరటోనిన్ ఉత్పత్తికి ఇది అత్యవసరం. కాబట్టి రోజూ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవటం అన్నివిధాలా మేలు.
అసలు ఈప్రకృతి మనందరికి  ఏకాలంలో ఏపండు వస్తుందో నిర్ణయించి మనకు అందిస్తుంది. ప్రతిపండులోనూ పలురకాలపోషకవిలువలుఉంటాయి.వీటితో పాటు ఆకుకూరలు,కాయగూరలు,దుంపలు వంటివి అన్ని ప్రకృతి వరలే! మైదా,చెక్కెర తోచేసిన పదార్ధాలు ప్రమాదకరమైనవి.చాక్ లెట్లు,బిస్కట్లు తినడానికి రుచిగా ఉన్న అవి అనారోగ్యాని కలగజేస్తాయి.డబ్బుఇచ్చి రోగాలను తెచ్చుకోవడం అవుతుంది. కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరినీరు ఎంతో మేలైనది. మామిడి,సపోటా,సీతాఫలం,పనస,రేగి,పుచ్చకాయ,కమలా,బత్తాయి,
నారింజ,బొప్పాయి వంటి అన్నిపండ్ల రకాలలో సంవృధ్ధిగా పోషకవిలువలు ఉన్నాయి. ఎవరైతే చెక్కెర,ఉప్పు తక్కువగా వాడతారో వాళ్ళు ఆరోగ్యం బాగాఉండే అవకాశం ఉంది ' అన్నాడు కోతి.
' నీకు ఇన్నివిషయాలు ఎలాతెలుసు' అన్నది పిల్లరామచిలుక.
' ఈ అడవి ఆధికారి వాళ్ళపిల్లలకు చెపుతుంటే విన్నాను'అన్నాడుకోతి.
' సరేగాని కోతిబావాఈసామెత ఏమిటి?  కరుస్తుంది చెప్పేగా కొత్త ' అని  తుర్రుమంది పిల్లరామ చిలుక. ఆసామెత అర్ధంకాక తెల్లమొహం వేసాడు కోతి. బాలలు ఆసామెత ఏమిటో మీరూ ప్రయత్నించండి.
తెలియకపోతే ఈదిగువన చూడండి.
' కొత్త చెప్పేగా కరుస్తుంది '

కామెంట్‌లు